యమహా ఎస్‌జెడ్-ఎస్, ఎస్‌జెడ్-ఆర్ఆర్ విడుదల

By Ravi

యమహా స్పోర్ట్స్ బైక్ ప్రియులకు గుడ్ న్యూస్. యమహా అందిస్తున్న ఎస్‌జెడ్ సిరీస్ మోటార్‌సైకిళ్లలో కంపెనీ రెండు కొత్త వేరియంట్లను అందుబాటులో తీసుకువచ్చింది. ఈ సిరీస్‌లో ఓ ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను అలాగే ఓ ప్రీమియం వేరియంట్‌ను యమహా విడుదల చేసింది. యమహా ఎస్‌జడ్‌-ఎస్‌, యమహా ఎస్‌జడ్‌-ఆర్‌ఆర్‌ పేర్లతో ఈ బైక్‌‌లను ప్రవేశపెట్టారు. వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా అన్ని యమహా షోరూమ్‌లలో అందుబాటులో వుంటాయని కంపెనీ పేర్కొంది. దేశీయ విపణలో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

  • యమహా ఎస్‌జడ్‌-ఎస్‌ - రూ. 59,500
  • యమహా ఎస్‌జడ్‌-ఆర్‌ఆర్‌ - రూ.62,500

(అన్ని ధరలు ఎక్స్‌-షోరూమ్, ఢిల్లీ)

Yamaha Bike

ఈ కొత్త వేరియంట్లలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇవి రెండు కూడా 150సీసీ ఇంజన్‌తో లభ్యం కానున్నాయి. స్మోక్డ్ విండ్‌స్క్రీన్, అల్యూమినియం గ్రాబ్-బార్స్, 3డి ఎస్‌జెడ్ లోగో వంటి స్పెషల్ ఫీచర్లతో యమహా ఎస్‌డ్-ఆర్ఆర్ బైక్ లభ్యం కానుంది. ఎస్‌జెడ్-ఎస్ సింపుల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం రే స్కూటర్స్ నెలకు 9,000-10,000 అమ్ముడవుతున్నాయి. మరోవైపు ఎస్‌జెడ్ శ్రేణి మోటార్ సైకిల్స్‌లో కొత్త వెర్షన్స్‌ని కూడా యమహా ఇండియా ఏడాది ఎగుమతులతో కలిపి మొత్తం 7.1 లక్షల మోటార్‌సైకిళ్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదిలా ఉండగా, యమహా ఇండియా భారత మార్కెట్లో మహిళా వినియోగదారుల కోసం అందిస్తున్న రే స్కూటర్‌ను ఆధారంగా చేసుకొని, పురుషుల కోసం రే జెడ్ అనే స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ. 48,555 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేటు). ప్రస్తుతం ప్రతినెలా సుమారు 10,000 యూనిట్ల రే స్కూటర్లను విక్రయిస్తున్నామని, అలాగే రే జెడ్ స్కూటర్లను కూడా నెలకు సుమారు 5,000 మేర విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు యమహా మోటార్ ప్రెసిడెంట్ హిరోయుకి యనగి తెలిపారు.

More from DriveSpark

Article Published On: Saturday, May 25, 2013, 17:26 [IST]
English summary
Yamaha Motor India has introduce two new model variations in the Yamaha SZ sport model series named the “SZ-RR” and “SZ-S.” The SZ-RR is defined by the sporty styling and look of quality in its exterior design with special features like its smoked windscreen, aluminum grab-bars and 3D “SZ” emblem. The SZ-S features a simpler design in the fuel tank that creates a calmer, more composed impression that will also be appreciated by all members of a family.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+