జనవరిలోనూ జోరందుకున్న యమహా అమ్మకాలు

ఈ సందర్భంగా, ఇండియా యమహా మోటార్ నేషనల్ బిజినెస్ హెడ్ రాయ్ కురియెన్ మాట్లాడుతూ.. తమ పటిష్టమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో, వినియోగదారుల విశ్వసనీయత మరియు కొత్త యమహా రే స్కూటర్‌లతో గడచిన నెలలో ప్రోత్సాహకర వృద్ధిని కళ్లజూసామని, భవిష్యత్తులోనూ ఇదే విధమైన వృద్ధిని కనబరచగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
యమహా తొలిసారిగా 1985లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. యమహా ఇండియాకు ఉత్తరప్రదేశ్‌లోని సర్జాపూర్, హర్యానాలోని ఫరీదాబాద్‌లలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఈ ప్లాంట్లలో తయారైన మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా, పొరగు దేశాలకు కూడా కంపెనీ ఎగుమతి చేస్తుంది. యమహాకు దేశవ్యాప్తంగా 400 లకు పైగా డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి.
ప్రస్తుతం యమహా దేశీయ విపణిలో విమ్యాక్స్ (1,679cc), వైజెడ్ఎఫ్-ఆర్1 (998cc), ఎఫ్‌జెడ్1 (998cc), ఫేజర్ (153cc), ఎఫ్‌జెడ్-ఎస్ (153cc), ఎఫ్‌జెడ్ (153cc), ఎస్‌జెడ్-ఎక్స్ & ఎస్‌జెడ్-ఆర్ (153cc), వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 (150cc), ఎస్ఎస్125 (123cc), వైబిఆర్ 125 (123cc), వైబిఆర్ 110 (106cc), క్రక్స్ (106cc) మరియు రే (113cc) స్కూటర్లను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








