యమహా నుంచి రానున్న మరొక 125సీసీ స్కూటర్
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఇండియా యమహా మోటార్, గడచిన సంవత్సరం భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి స్కూటర్ 'యమహా రే' మంచి సక్సెస్‌ను సాధించటంతో పాటుగా ప్రస్తుతం ద్విచక్ర వాహన మార్కెట్లో స్కూటర్ విభాగానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటంతో ఈ విభాగంలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, తమ వినియోగదారులకు విస్తృత స్థాయిలో ఉత్పత్తులను అందించేందుకు మహహా ఇండియా సన్నాహాలు చేస్తుంది.
ఇందులో భాగంగానే, యమహా ఇండియా త్వరలో మరొక సరికొత్త 125సీసీ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న యమహా రే స్కూటర్ ప్రత్యేకించి భారతీయ మహిళలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసిన నేపథ్యంలో, కంపెనీ కొత్తగా మార్కెట్లోకి తీసుకురానున్న 125సీసీ స్కూటర్ ఇటు పురుషులకు అటు స్త్రీలకు సరిపోయే విధంగా డిజైన్ చేసే ఆస్కారం ఉంది.

గతంలో ఒకానొక సందర్భంలో ఇండియా యమహా మోటార్ మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిరోయుకి సుజుకి ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. మాస్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని రూ.40,000 నుంచి రూ.50,000 ధర రేంజ్‌లో ఓ 125సీసీ స్కూటర్‌ను ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం యమహీ ప్రీమియం, డీలక్స్, కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లలో ద్విచక్ర వాహనాలను అందిస్తోంది. యమహా రే స్కూటర్ విడులతో కంపెనీ స్కూటర్ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించింది.
యమహా రే స్కూటర్‌లో ఉపయోగించిన 113సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7. పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 61.1 కి.మీ. మైలేజీనిస్తుంది (స్టాండర్డ్ రైడింగ్ నిబంధనల ప్రకారం). కాగా.. యమహా కొత్తగా మార్కెట్లోకి తీసుకురానున్న 125సీసీ స్కూటర్ ధరను అందుబాటులో ఉంచేందుకు గాను అందులో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








