ఐ మార్క్ అవార్డ్ 2013ను గెలుచుకున్న యమహా రే
జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్, భారత మార్కెట్లో అందిస్తున్న మొట్టమొదటి స్కూటర్ 'యమహా రే' 2013 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఇండియా డిజైన్ మార్క్ (ఐ మార్క్) అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును ఇండియా డిజైన్ కౌన్సిల్ అందజేస్తుంది. గడచిన సంవత్సరంలో కూడా యమహా అందిస్తున్న వైజెడ్ఎఫ్-ఆర్15 స్పోర్ట్స్ ఈ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో వరుసగా రెండుసార్లు ఐ మార్క్ అవార్డును యమహా గెలుచుకున్నట్లయింది.
భారతీయ మహిళలను లక్ష్యంగా చేసుకొని యమహా తమ 'రే' బైక్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్లో రే స్కూటర్ యమహా ప్రోడక్ట్ పోర్ట్ ఫోలియో నుంచి లభిస్తున్న మొట్టమొదటి స్కూటర్. ఈ స్కూటర్ విడుదల ద్వారా యమహా దేశీయ విపణిలో స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. యమహా ఈ స్కూటర్‌ను తొలిసారిగా గడచిన సంవత్సరం జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో యమహా రేను వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేసింది.

యమహా రే స్కూటర్ ఈ సెగ్మెంట్లోని హోండా, టీవీఎస్, సుజుకి కంపెనీలు అందిస్తున్న పవర్‌ఫుల్, స్టయిలిష్ స్కూటర్లకు పోటీగా నిలువనుంది. యమహా రే స్కూటర్‌లో ఉపయోగించిన 113సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7. పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 61.1 కి.మీ. మైలేజీనిస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5 లీటర్లు. యమహా రే స్కూటర్ రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది. ఇది స్టేరీ వైట్, ప్లష్ పింక్, బ్లాక్ స్టార్, షైనింగ్ బ్లూ, బర్గండి బ్లిస్, పర్పల్ పేస్టెల్ మరియు గ్రే గాండ్యూర్ అనే ఏడు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








