నీటితో నడిచే బైక్‌ను తయారు చేసిన యువ మెకానిక్

అదెలా సాధ్యం అంటారా..? అయితే, ఈ కథనం చదవండి..!
జగిత్యాలలోని మల్యాల ప్రాంతానికి చెందిన కస్తూరి ప్రసాద్ అనే ఓ యువ మెకానిక్ పెట్రోల్‌తో పాటుగా నీటిని కూడా ఇంధనంగా చేసుకొని నడిచే మోటార్‌సైకిల్‌ను సృష్టించి శభాష్ అనిపించుకున్నాడు. డ్యూయెల్ ఫ్యూయెల్‌తో (పెట్రోల్, నీరు) బైక్‌ను నడిపేందుకు గాను ప్రసాద్ ఓ యంత్ర పరికరాన్ని తయారు చేశాడు. ఈ పరికరాన్ని వాటర్ బాటల్‌కు అనుసంధానం చేసి అర లీటర్ పెట్రోల్, 2 లీటర్ల నీటిని ఉపయోగించి బైక్ నడిపాడు.
ఈ విధంగా అర లీటర్ పెట్రోల్, 2 లీటర్ల నీటితో 110 కిలోమీటర్ల మైలేజీని పొందవచ్చని ప్రసాద్ వివరించాడు. తాను తయారు చేసిన పరికరం సాయంతో వాటర్ బాటిల్ నుండి నీటిని కార్పెటర్‌కు పైపుకు సరఫరా అయ్యేట్లు చేశాడు. ఇదే టెక్నాలజీని కార్లలో కూడా ఉపయోగించుకోవచ్చని, ఆ దిశగా తాను ప్రయత్నాలు చేస్తున్నానని ప్రసాద్ తెలిపాడు. నీటితో నడిచే బైక్‌ను తయారు చేసేందుకు కేవలం రూ.4500 మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చాడు.
ఈ పరికరాన్ని అమర్చుకోవటం వలన వాహనానికి వచ్చే నష్టం ఏమీ లేదని, పైగా దీని వలవ తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలు ఎవైరానా ముందుకు వచ్చి చేయూతనందిస్తే, ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచి అందరికీ అందుబాటులోకి వచ్చేలా అభివృద్ధి చేస్తానని ప్రసాద్ తెలిపారు.


Click it and Unblock the Notifications








