2014 ఈఐసిఎమ్ఏలో హీరో హెచ్ఎక్స్250ఆర్ ఆవిష్కరణ

By Ravi

ఈ ఫొటోలో కనిపిస్తున్న బైక్‌ని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది కదూ..! ఈ ఏడాది ఆరంభంలో 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోకి కొద్ది రోజుల ముందుగా ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన 250 సీసీ స్పోర్ట్స్ బైక్ 'హీరో హెచ్‌ఎక్స్‌250ఆర్' (Hero HX250R) మోడల్ ఇది.

ఇప్పుడు ఈ బైక్‌ను మిలాన్‌లో జరుగుతున్న 2014 ఈఐసిఎమ్ఏలో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. యూరోపియన్ మార్కెట్లను అలాగే ఏషియన్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేసిన హీరో హెచ్ఎక్స్250ఆర్ వచ్చే ఏడాది కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.


ఈ బైక్‌లో ఉపయోగించిన 250సీసీ ఇంజన్ గరిష్టంగా 31 పిఎస్‌‌ల శక్తిని, 26 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది కేవలం 2.7 సెకండ్ల వ్యవధిలోనే 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

అండర్ సీట్ ఎగ్జాస్ట్ (సీటు క్రింద ఉండే సైలెన్సర్) ఇందులో ప్రధాన ప్రత్యేకత. ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇగ్నిషన్ సిస్టమ్, కాంబినేషన్ ఆఫ్ ఏబిఎస్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఈ బైక్ బరువు కేవలం 139 కిలోలు మాత్రమే.

హీరో మోటోకార్ప్ అమెరికన్ పార్ట్‌నర్ మరియు పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లను తయారు చేటంలో ప్రసిద్ధి చెందిన ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ (ఈబిఆర్) నుంచి సేకరించిన కీలకమైన ఇన్‌పుట్స్ ఆధారంగా చేసుకొని హీరో హెచ్ఎక్స్250ఆర్ మోటార్‌సైకిల్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిద్దారు.

Hero HX250R Rear

హీరో మోటోకార్ప్ ఈ గ్లోబల్ ప్రోడక్ట్ (హెచ్ఎక్స్250ఆర్)కు ఇటీవలే అమెరికా, యూరప్‌లో పేటెంట్ కూడా చేసుకుంది. ఈ బైక్ భారత్‌లో విడుదలైన తక్షణమే, అమెరికన్ మార్కెట్లలో కూడా విడుదల కానుంది. అయితే, అమెరికాలో ఇది హీరో బ్రాండ్‌తో అమ్ముడవుతుందా లేక ఈబిఆర్ బ్యాడ్జ్‌తో అమ్ముడుపోతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

హీరో హెచ్ఎక్స్250ఆర్ అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్300ఆర్, యమహా ఆర్3, కవాసకి నిన్జా 300 మోడళ్లతోను, దేశీయ మార్కెట్లో కెటిఎమ్ ఆర్‌సి200, హోండా సిబిఆర్ 250ఆర్ వంటి మోడళ్లతోనూ పోటీపడుతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి. ఈలోపుగా ఈ బైక్ టీజర్ వీడియోని వీక్షించండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/XbHvO7yerL0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, November 7, 2014, 14:10 [IST]
English summary
Hero MotoCorp has showcased its all-new 250cc sports bike HX250R at 2014 EICMA along with the entire range of company’s motorcycles. Hero HX250R is powered by 249cc, liquid-cooled, single cylinder engine which produces 31 PS and 26 Nm, mated to 6-speed gearbox.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+