2014 హీరో గ్లామర్ విడుదల: ధర, మైలేజ్, ఫీచర్లు
హీరో మోటోకార్ప్ అందిస్తున్న గ్లామర్ బైక్‌లో ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హీరో గ్లామర్ కొన్ని కాస్మోటిక్ మార్పులతో లభిస్తుంది. దేశీయ విపణిలో 2014 హీరో గ్లామర్ బైక్ ధర రూ.53,375 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త హీరో బైక్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో పరిశీలించండి.
2014 హీరో గ్లామర్‌లో మార్పులు
కొత్త 2014 హీరో గ్లామర్ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ స్టైలింగ్‌లో మార్పులు ఉన్నాయి. ఇది సరికొత్త ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ బ్లాక్, రెడ్ సిల్వర్, బ్లాక్-బ్లూ, బ్లాక్ గ్రే అనే ఐదు రంగులలో లభిస్తుంది.

2014 హీరో గ్లామర్ ఇంజన్, ట్రాన్సిమిషన్
కొత్త 2014 హీరో గ్లామర్ బైక్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ఇందులో ఇదివరకటి 124.7సీసీ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ 7000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 10.35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
2014 హీరో గ్లామర్ మైలేజ్
హీరో మోటోకార్ప్ తమ కొత్త 2014 గ్లామర్ బైక్‌కు సంబంధించిన మైలేజ్ వివరాలను వెల్లడించలేదు. కానీ, పాత మోడల్ ప్రకారం చూసుకుంటే, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ వేరియంట్ గరిష్టంగా లీటరుకు 70 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇది 13.6 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంటుంది.

2014 హీరో గ్లామర్ ఫీచర్లు
కొత్త అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఈ బైక్‌లో చూడొచ్చు. ఇందులో స్పీడోమీటర్ అనలాగ్ కాగా, ఓడోమీటర్, ఫ్యూయెల్ గేజ్ మరియు ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ మీటర్లు డిజిటల్‌గా ఉంటాయి. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు 5-స్టెప్ అడ్జస్టబల్ షాక్ అబ్జార్వర్‌లను ఆఫర్ చేస్తున్నారు. ఇకపోతే, ముందు వైపు ఆప్షనల్ 240 మి.మీ. డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు ఆప్షనల్ 130 డిస్క్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్స్ 130 మి.మీ. డయాను కలిగి ఉంటాయి.
2014 హీరో గ్లామర్ వేరియంట్లు, ధరలు
గ్లామర్ (కార్బురేటర్) - రూ.53,375 (డ్రమ్); రూ.55,375 (డిస్క్)
గ్లామర్ ఎఫ్ఐ (ఫ్యూయెల్ ఇంజెక్షన్) - రూ.58,700 (డ్రమ్); రూ.62,750 (డిస్క్)


Click it and Unblock the Notifications








