2014 హీరో ఎక్స్‌ట్రీమ్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ త్వరలో సరికొత్త హీరో 2014 ఎక్స్‌ట్రీమ్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ఈ నెల ఆరంభంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ నేడు (ఏప్రిల్ 21, 2014) సైలెంట్‌గా తమ సరికొత్త అప్‌డేటెడ్ ఎక్స్‌ట్రీమ్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: హీరో మోటోకార్ప్ నుంచి ఆరు నెలల్లో 15 కొత్త ఉత్పత్తులు
కొత్త 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్ ఇదివరకటి మోడల్ మాదిరిగాన్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు ఫ్రండ్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్ వేరియంట్లలో లభిస్తుంది. హీరో మోటోకార్ప్ విడుదల చేసిన ఈ అప్‌గ్రేడెడ్ 150సీసీ ప్రీమియం మోటార్‌సైకిల్ డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇందులో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ ఫీచర్‌ను ఆఫర్ చేస్తున్నారు.
కొత్త 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇంజన్ ఇమ్మొబిలైజర్
కొత్త 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్ ఇంజన్ ఇమ్మొబిలైజర్ ఫీచర్‌తో లభిస్తుంది. ఇంజన్ ఇమ్మొబిలైజర్ అనేది కార్లలో ఉండే ఓ సెక్యూరిటీ ఫీచర్. ఇమ్మొబిలైజర్ అంటే ఆ వాహనానికి సంబంధించిన సరైన తాళం చెవిని వాడితేనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. వేరే తాళంతో ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే, అలారం మ్రోగి చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. ఈ ఫీచర్ ఈ సెగ్మెంట్లోనే మొట్టమొదటిది.

వేరియంట్లు ధరలు
కొత్త 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ రెండు వేరియంట్లలో (ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ఫ్రండ్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్) లభిస్తుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ (ఫ్రంట్ డిస్క్ బ్రేక్) - రూ.66,516
* 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ (ఫ్రండ్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్) - రూ.69,530
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

ఇంజన్
ఇందులో 149.2సీసీ ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 14.4 పిఎస్‌ల శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 12.80 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

సస్పెన్షన్ అండ్ బ్రేక్స్
ఈ బైక్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్‌ను, వెనుక వైపు రెక్ట్యాంగ్యులర్ స్వింగ్ ఆర్మ్ విత్ 5-స్టెప్ అడ్జస్టబల్ గ్యాస్ రిజర్వాయిర్ సస్పెన్షన్‌ను జోడించారు.
బ్రేక్స్ విషయానికి వస్తే..ముందు వైపు 240మి.మీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 130 మి.మీ. డ్రమ్ బ్రేక్ అలాగే ఆప్షనల్‌గా 220 మి.మీ. డిస్క్ బ్రేక్‌లను ఆఫర్ చేస్తున్నారు.

కలర్ ఆప్షన్స్
కొత్త 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ 150సీసీ బైక్ బ్లూ, ఆరెంజ్, రెడ్ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

స్పోర్ట్ వెర్షన్ ఎక్స్‌ట్రీమ్
హీరో మోటోకార్ప్ 2014 ఎక్స్ట్‌ట్రీమ్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన స్పోర్ట్ వెర్షన్‌ను కూడా గతంలో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. అయితే, ఈ బైక్‌ను ఎప్పుడ విడుదల చేసే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








