2014 కరిజ్మా ఆర్, కరిజ్మా జెడ్ఎమ్ఆర్ స్పెసిఫికేషన్స్

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ఇటీవలే తమ నెక్స్ట్ జనరేషన్ కరిజ్మా ఆర్, కరిజ్మా జెడ్ఎమ్ఆర్ బైక్‌లను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. హీరో మోటోకార్ప్ కొత్త అమెరికన్ భాగస్వామి ఎరిక్ బ్యూయెల్ రేసింగ్‌ (ఈబిఆర్) సాంకేతిక మద్ధతుతో కంపెనీ ఈ ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేసింది.

ఈ రెండు బైక్‌లకు సంబంధించిన పవర్, పెర్ఫామెన్స్ స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా వెల్లడి చేయకపోయినప్పటికీ, ఆన్‌లైన్‌లో ఈ వివరాలు లీక్ అయ్యాయి. ఈబిఆర్ సాయంతో కరిజ్మా ఆర్, కరిజ్మా జెడ్ఎమ్ఆర్‌ల పవర్‌ను హీరో మోటోకార్ప్ పెంచగలిగింది.


కొత్త 2014 కరిజ్మా ఆర్ బైక్‌లో ఇదివరకటి 223సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌నే ఉపయోగించినప్పటికీ, అది ఇప్పుడు గరిష్టంగా 19.2 పిఎస్ (గతంలో 17.2 పిఎస్)ల శక్తిని, 19.35 ఎన్ఎమ్‌ (గతంలో 18.35 ఎన్ఎమ్)ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.6 సెకండ్ల వ్యవధిలో 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది (గతంలో ఈ వేగం చేరుకునేందుకు 4 సెకండ్ల వ్యవధి పట్టేది).
2014 Karizma ZMR

కరిజ్మా జెడ్ఎమ్ఆర్‌లో కూడా అదే 223సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, ఇందులో ఫ్యూయెల్ ఇంజక్షన్ సిస్టమ్ వలన ఈ ఇంజన్ గరిష్టంగా 20 పిఎస్‌ల శక్తిని, 19.7 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 3.6 సెకండ్ల వ్యవధిలో 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు బైక్‌లతో పాటుగా మరో డజనుకు పైగా కొత్త/అప్‌గ్రేడెడ్ ఉత్పత్తులను హీరో మోటోకార్ప్ త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 19, 2013, 17:11 [IST]
English summary
The power figures of the 2014 Karizma R and ZMR models, though not official, have now surfaced online. Starting with the Karizma R. The bike is still powered by an air-cooled 223cc engine, which now produces 19.2 PS power and 19.35 Nm of peak torque. In comparison, the outgoing Karizma R generates 17.2 PS power and 18.35 Nm torque. The new Karizma R can also reach 0-60 km/h in 3.6 seconds, where previously it took the bike 4 seconds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+