భారత్‌కు రానున్న 2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి భారత మార్కెట్‌కు మరో శక్తివంతమైన బైక్‌ను పరిచయం చేయనుంది. గడచిన ఆదివారంతో ముగిసిన 2013 ఈఐసిఎమ్ఏ అంతర్జాతీయ మోటార్‌సైకిల్ షోలో కవాసకి ఆవిష్కరించిన '2014 జెడ్1000' స్పోర్ట్స్‌‌‌బైక్‌ను ఇండియన్ మార్కెట్‌కు కూడా తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

మోన్‌స్టర్ లుక్‌తో కనిపించే ఈ జెడ్1000 బైక్, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న నిన్జా 1000 బైక్‌ (ఫెయిర్డ్ వెర్షన్)కి నేక్డ్ వెర్షన్. సరికొత్త స్టైల్ మరియు లుక్ అండ్ ఫీల్‌తో ఈ బైక్‌ను డిజైన్ చేశారు. కవాసకి పాపులర్ డిజైన్ సిద్ధాంతమైన 'సుగోమీ డిజైన్ ఫిలాసఫీ'ని ఆధారంగా చేసుకొని దీనిని అభివృద్ధి చేశారు.

కవాసకి జెడ్1000 స్పోర్ట్స్ బైక్‌కు పూర్తి స్పెసిఫికేషన్లను మరియు మరిన్న వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

జపనీస్‌లో సుగోమీ అంటే ఏదైనా వస్తువు లేదా ఎవరైనా వ్యక్తి ద్వారా అందించబడే శక్తి అని అర్థం. ఇదే సిద్ధాంతపై రూపుదిద్దుకున్న కవాసకి జెడ్1000 ఓ హైపెర్ఫామెన్స్ బైక్.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

కవాసకి జెడ్1000 సూపర్‌బైక్‌లో కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ డిజైన్ చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. అంతేకాదు.. ఓ జపనీస్ స్పోర్ట్ బైక్‌లో ఎల్ఈడి హెడ్‌లైట్లను ఉపయోగించటం కూడా ఇదే మొదటిసారి.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

కవాసకి జెడ్1000 బైక్‌లో శక్తివంతమైన 1043సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 హార్స్ పవర్‌ల శక్తిని, 111 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. (ఇది రీట్యూన్ చేయబడిన ఇంజన్).

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

ఈ బైక్‌లో కవాసకి ఈసియూ సెట్టింగ్స్‌ను కూడా రివైజ్ చేసింది. ఇంకా కామ్‌షాఫ్ట్ టైమింగ్స్‌ను ఆల్టర్ చేయటం, కొత్త ఎయిర్‌బాక్స్ డిజైన్‌ను పరిచయం చేయటం కూడా జరిగింది.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

బ్రేక్ మోనోబ్లాక్ కాలిపర్స్‌ను టోకికో గ్రిప్పింగ్ పెటల్ బ్రేక్ డిస్క్స్ నుంచి గ్రహించారు. మాస్టర్ సిలిండర్‌లో చేసిన ఇంప్రూవ్‌మెంట్స్ కూడా బ్రేకింగ్ పెర్ఫామెన్స్‌ను మెరుగుపరచాయి.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

షోవా బిగ్ పిస్టన్ ఫోర్క్ నుంచి గ్రహించిన సస్పెన్షన్ కూడా మరింత సౌకర్యవంతమైన రైడ్‌ను ఆఫర్ చేస్తుంది.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

ఫుల్ ట్యాంక్ ఇంధనంతో (17 లీటర్లు) కలిపి 2014 కవాసకి జెడ్1000 మొత్తం బరువు 221 కేజీలు.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

కొత్త 2014 కవాసకి జెడ్1000 బైక్ ధర 11,999 డాలర్లుగా నిర్ణయించారు. మునుపటి వెర్షన్ ధర కన్నా దీని ధర 1,000 డాలర్లు అధికం.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

కవాసకి జెడ్1000 బైక్ గోల్డెన్ బ్లేజ్డ్ గ్రీన్, మెటాలిక్ గ్రాఫైట్ గ్రే రంగులలో లభిస్తుంది.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

కొత్త 2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్ బైక్ డిజిటల్ అండ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

కొత్త 2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్ బైక్‌లో డ్యూయెల్ వెంట్స్ కలిగిన సైలెన్సర్ కొత్తగా అనిపిస్తుంది.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

కొత్త 2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్ బైక్ ఎలక్ట్రికల్ కంట్రోల్స్.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

కొత్త 2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్ బైక్‌లోని సైడ్ వ్యూ మిర్రర్స్ షార్ప్ డిజైన్‌తో స్టయిలిష్‌గా ఉంటాయి.

2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్‌బైక్

కొత్త 2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్ బైక్‌లో ప్రొజెక్టర్ స్టైల్ ఎల్ఈడి హెడ్‍‌‌లైట్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Monday, November 11, 2013, 12:06 [IST]
English summary
The Kawasaki Z1000 is a monster in every way you look at it. For 2014 the massive naked version of the Ninja 1000 comes with a bevy of upgrades and a few prominent styling changes which will either make you stand in awe, admiring the bike or hate it outright. For our part, we love it.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+