2014 యమహా ఎఫ్‌జెడ్ఎమ్‌టి-09 త్రీ సిలిండర్ స్ట్రీట్ బైక్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఓ సరికొత్త స్ట్రీట్ బైక్‌ను ఆవిష్కరించింది. ప్రత్యేకించి యూరోపియన్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని యమహా మోటార్ కార్పోరేషన్ అభివృద్ధి చేసిన 2014 యమహా ఎఫ్‌జెడ్ఎమ్‌టి-09 బైక్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ స్ట్రీట్ బైక్‌లో యమహా కొత్తగా తమ తొలి త్రీ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించింది. యూరోపియన్ మార్కెట్లలో ఇది ఎమ్‌టి-09 అనే పేరుతో, నార్త్ అమెరికా మార్కెట్లలో ఎఫ్‌జెడ్-09 పేరుతో లభ్యం కానుంది.

యమహా ఎమ్‌టి-09 స్ట్రీట్ బైక్‌‌లో 847సీసీ త్రీ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 10,000 ఆర్‌‌పిఎమ్ వద్ద 113 హార్స్ పవర్‌ల గరిష్ట శక్తిని, 8,500 ఆర్‌‌పిఎమ్ వద్ద 64.5 ఫుట్ పౌండ్స్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదివరకు ఈ బైక్ స్థానంలో ఉన్న యమహా ఎఫ్‌జెడ్8 మోడల్‌లో ఉపయోగించిన 779సీసీ ఫోర్ సిలిండర్ ఇంజన్ 10,000 ఆర్‌‌పిఎమ్ వద్ద 104.7 హార్స్ పవర్‌ల గరిష్ట శక్తిని, 8,000 ఆర్‌‌పిఎమ్ వద్ద 60.5 ఫుట్ పౌండ్స్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మునపటి వెర్షన్ కన్నా ఇది తేలికగా ఉంటుంది.

యమహా ఎమ్‌టి-09లో కొత్త ఇంజన్‌తో పాటుగా రిగిడిటీని మెరుగుపరచే సరికొత్త సిఎఫ్ అల్యూమినియం డై-కాస్ట్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇంకా ఇందులో 298 మి.మీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 245 మి.మీ రియర్ డిస్క్ బ్రేక్, 41 మి.మీ. యూఎస్‌డి ఫోర్క్స్ వంటి ఫీచర్లున్నాయి. యూఎస్‌లో ఈ యమహా ఎమ్‌టి-09 బైక్ ధర 7,990 డాలర్లుగా ఉండగా, యూకేలో 6799 పౌండ్లుగా ఉంది. ఈ బైక్ ఇంజన్ సామర్థ్యం 800సీసీ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇది సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఈలోపుగా మనం ఈ బ్యూటీ అందాలపై ఓ కన్నేద్దాం రండి..!

2014 యమహా ఎమ్‌టి-09
2014 యమహా ఎమ్‌టి-09
2014 యమహా ఎమ్‌టి-09
2014 యమహా ఎమ్‌టి-09
2014 యమహా ఎమ్‌టి-09
2014 యమహా ఎమ్‌టి-09
2014 యమహా ఎమ్‌టి-09
2014 యమహా ఎమ్‌టి-09
2014 యమహా ఎమ్‌టి-09
2014 యమహా ఎమ్‌టి-09
2014 యమహా ఎమ్‌టి-09
2014 యమహా ఎమ్‌టి-09

More from DriveSpark

Article Published On: Monday, June 17, 2013, 17:01 [IST]
English summary
Yamaha has launched the first motorcycle powered its new three cylinder engine, the 2014 MT-09, for the European market. The same bike has also been announced for North America where it will be called FZ-09.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+