శ్రీలంక ప్రభుత్వం నుంచి 1.25 లక్షల బజాజ్ బైక్‌లకు ఆర్డర్

By Ravi

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో, శ్రీలంక ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. కంపెనీ విక్రయిస్తున్న డిస్కవర్ 125ఎమ్ మోడల్ కోసం ఈ ఆర్డర్ లభించింది. ఈ డీల్‌లో భాగంగా, బజాజ్ ఆటో మొత్తం 1.25 లక్షల బజాజ్ డిస్కవర్ 125ఎమ్ మోడళ్లను శ్రీలంక ప్రభుత్వానికి సప్లయ్ చేయనుంది.

శ్రీలంకలో బజాజ్ ఆటోకి అధీకృత డీలర్ అయిన డేవిడ్ పీరిస్ మోటార్ కంపెనీ ద్వారా ఈ ఆర్డర్ దక్కించుకుందే. మొదట్లో 50,000 యూనిట్ల డిస్కవర్ 125ఎమ్ మోడళ్లకు ఆర్డర్ రాగా, అందులో కంపెనీ ఇప్పటికే 48,000 యూనిట్లను డెలివరీ చేసింది. కాగా.. ఇప్పుడు ఇదే డిస్ట్రిబ్యూటర్ ద్వారా బజాజ్ ఆటో మరో బల్క్ ఆర్డర్ దక్కించుకుంది.

ఈసారి ఏకంగా 1.25 లక్షల యూనిట్ల డిస్కవర్ 125ఎమ్ మోటార్‌సైకిళ్లకు ఆర్డర్ లభించింది. మరో 3-4 నెలల్లో కంపెనీ ఈ వాహనాలను డెలివరీ చేయనుంది. ఈ ద్విచక్ర వాహనాలను పోలీసుల కోసం వినియోగిస్తారా లేక మరి ఏదైనా ప్రభుత్వ విభాగం కోసం విక్రయిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Bajaj Discover 125M

బజాజ్ డిస్కవర్ 125ఎమ్ విషయానికి వస్తే.. ఇందులోని 124.6సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-వాల్వ్, డిటిఎస్-ఐ ఇంజన్ గరిష్టంగా 11.5 పిఎస్‌ల శక్తిని, 10.4 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది లీటరుకు గరిష్టంగా 76 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఆకర్షనీయమైన ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, పెటల్ డిస్క్ బ్రేక్ మరియు స్టయిలిష్ అల్లాయ్ వీల్స్‌ను ఈ బైక్‌లో ఆఫర్ చేస్తున్నారు. ఇందులోని నైట్రాక్స్ సస్పెన్షన్ కంఫర్టబల్ రైడ్‌ను ఆఫర్ చేస్తుంది. దేశీయ విపణిలో ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.50,530 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 20, 2014, 14:24 [IST]
English summary
Bajaj Auto has bagged an order for 1.25 lakh units of Discover-125M motorcycles from Sri Lankan government.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+