డిసెంబర్ నెలలో 13 శాతం తగ్గిన బజాజ్ ఆటో సేల్స్

By Ravi

ద్విచక్ర వాహన మార్కెట్లో తాజాగా ప్రవేశిస్తున్న కొత్త కంపెనీలు మరియు సరికొత్త మోడళ్ల రాకతో ఈ సెగ్మెంట్లో పోటీ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో లిమిటెడ్ ఆశించిన రీతిలో ప్రతిభ కనబరచలేకపోతోంది. ప్రస్తుత పోటీ వాతావరణంలో బజాజ్ ఆటో గట్టెక్కాలంటే సరికొత్త మోడళ్లను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ద్విచక్ర వాహన విభాగంలో ప్రస్తుతం స్కూటర్లకు మంచి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, బజాజ్ ఆటో ఇంకా మేలుకోకుండా కేవలం మోటార్‌సైకిళ్ల పైనే ఆధారపడటం కూడా ఈ కంపెనీని ఇతర పోటీదారులు ఓవర్‌టేక్ చేయటానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. గడచిన డిసెంబర్ నెలలో బజాజ్‌ ఆటో మోటార్‌సైకిల్ అమ్మకాలు 12.63 శాతం క్షీణించి 2,60,645 యూనిట్లుగా నమోదయ్యాయి.

Bajaj Pulsar

అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో మోటార్‌సైకిళ్ల అమ్మకాల సంఖ్య 2,98,350 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో వాణిజ్య వాహన విభాగంలో అమ్మకాలు 37,171 యూనిట్ల నుంచి 45,596 యూనిట్లకు పెరిగి 18.47 శాతం వృద్ధిని కనబరించాయి.

అయితే, ఈ సమయంలో కంపెనీ ఎగుమతులు మాత్రం 19.63 శాతం వృద్ధి చెంది 1,26,016 యూనిట్ల నుంచి 1,50,753 యూనిట్లకు పెరిగాయి. గడచిన నెలలో మొత్తం వాహన అమ్మకాలు 2,97,776 యూనిట్ల నుంచి 3,43,946 యూనిట్లకు పెరిగి 13.42 శాతం వృద్ధిని కనబరచాయి.

More from DriveSpark

Article Published On: Saturday, January 4, 2014, 11:23 [IST]
English summary
Bajaj Auto has reported 12.63 per cent decline in motorcycle sales at 2,60,645 units in December 2013. The company had sold 2,98,350 units in the corresponding month previous year, Bajaj Auto Ltd (BAL) said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+