బజాజ్ డిస్కవర్ ఎఫ్150 స్పోర్టీ వెర్షన్ వస్తోంది!

By Ravi

ఇప్పటి వరకు రెగ్యులర్ డిస్కవర్ మోటార్‌సైకిళ్లను చూసి బోర్ కొట్టేసిందా..? అయితే త్వరలోనే ఓ సరికొత్త స్పోర్టీ వెర్షన్ డిస్కవర్ మన ముందుకు రాబోతోంది. ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తమ డిస్కవర్ బ్రాండ్ విస్తరణలో భాగంగా, సెమీ ఫెయిరింగ్స్‌తో కూడిన 150సీసీ డిస్కవర్‌ను పూనే రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది.

ఈ బైక్‌కు 'డిస్కవర్ ఎఫ్150' అనే పేరును పెట్టనున్నట్లు సమాచారం. ప్రముఖ ఆటోమొబైల్ మ్యాగజైన్ ఓవర్‌డ్రైవ్ ఈ సరికొత్త బజాజ్ డిస్కవర్ ఎఫ్150 బైక్ స్పై షాట్స్‌ను తమ కెమెరాలో బంధించింది. ఈ స్పై షాట్స్‌లో సింగిల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, మోనో రియర్ షాక్స్, సన్నటి ఫ్రంట్ ఫోర్క్స్ వంటి ఫీచర్లను గమనిస్తే, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ డిస్కవర్ 125ఎస్‌టి మోడల్ ఆధారంగా చేసుకొని ఈ కొత్త బైక్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.


డిస్కవర్ ఎఫ్150 బైక్‌లో కొత్త 4-వాల్వ్, 150సీసీ, సింగిల్ సిలిండర్, డిసిఎస్-ఐ ఇంజన్‌ను ఉపయోగించనున్నారని, ఈ ఇంజన్ గరిష్టంగా 14 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుందని సమాచారం. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న పల్సర్ 150 మోడల్‌కు దిగువన ఈ కొత్త డిస్కవర్ ఎఫ్150 బైక్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Discover F150 Spotted

కొత్త బజాజ్ డిస్కవర్ ఎఫ్150 బైక్‌ను పెర్ఫార్మెన్స్‌తో పాటు మైలేజీని కూడా దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు. ఇందులో ఫెయిర్డ్ వెర్షన్‌తో పాటుగా నేక్డ్ వెర్షన్ డిస్కవర్ ఎఫ్150 కూడా విడుదలయ్యే ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి ఈ బైక్‌కి సంబంధించిన మరింత సమాచారం అందుబాటులో లేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, March 15, 2014, 10:48 [IST]
English summary
The images you see below are of a bike believed to called Bajaj Discover F150. Spotted by Overdrive magazine, this semi-faired motorcycle is believed to be an upcoming flagship Discover model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+