బజాజ్ పల్సర్ ఇప్పుడు మూడు సరికొత్త రంగుల్లో లభ్యం!
బజాజ్ పల్సర్ 180 ఇప్పుడు మూడు సరికొత్త డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇది సఫైర్ బ్లూ, పెరల్ వైట్, కాక్‌టైల్ వైన్ రెడ్ అనే మూడు కొత్త రంగుల్లో ఇది లభిస్తుంది. ఇదివరకు పల్సర్ 200ఎన్ఎస్ మోడల్ కంపెనీ డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే.
పల్సర్ 150 ఇప్పటికే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లతో లభిస్తుండగా, తాజాగా పల్సర్ 180లో కూడా డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్‌ను పరిచయం చేయటంతో మొత్తం పల్సర్ రేంజ్ బైక్‌లు ఇప్పుడు డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో లభ్యం కానున్నాయి. కాగా.. ఈ కొత్త పల్సర్ 180లో కాస్మోటిక్ మార్పులు తప్ప, వేరే ఏ ఇతర మార్పులు లేవు.

మరోవైపు పల్సర్ 150, పల్సర్ 180 మోడళ్లలో త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల కానున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. ఇదే గనుక జరిగితే, త్వరలోనే ఈ రెండు మోడళ్లు మార్కెట్ నుంచి తొలగిపోయే ఆస్కారం ఉంది.
ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ల పల్సర్ బైక్‌లలో వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్‌ను జోడించనున్నట్లు సమాచారం. యమహా ఎఫ్‌జెడ్-ఎస్/ఎఫ్‌జెడ్-16, హోండా యునికార్న్ మరియు త్వరలోనే రానున్న సుజుకి జిక్సర్ 150 వంటి బైక్‌లలో మోనోషాక్ సస్పెన్షన్ ఉపయోగిస్తున్న నేపథ్యంలో, బజాజ్ కూడా ఎట్టకేలకు తమ పల్సర్ రేంజ్ బైక్‌లలో ఈ ఫీచర్ను పరిచయం చేయాలని చూస్తోంది (ఇప్పటికే పల్సర్ 200ఎన్ఎస్‌లో ఈ ఫీచర్ను పరిచయం చేసిన సంగతి తెలిసినదే).
DON'T MISS: FACEBOOK VIDEO OF THE DAY


Click it and Unblock the Notifications








