డ్యూయెల్ టోన్ బజాజ్ పల్సర్స్ టెలివిజన్ కమర్షియల్
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో అందిస్తున్న పల్సర్ బైక్ కోసం కంపెనీ కొత్తగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ మోడల్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే, బజాజ్ అప్పుడప్పుడూ తమ పల్సర్ బైక్ కోసం యాడ్ క్యాంపైన్స్ చేస్తుంటుంది. ఈ ప్రకటనలు బజాజ్ పల్సర్ మాదిరిగానే స్టన్నింగ్‌గా ఉంటాయి.
గడచిన ఏప్రిల్ నెలలో బజాజ్ ఆటో తమ పల్సర్ రేంజ్ మోటార్‌సైకిళ్లలో రిఫ్రెష్డ్ వెర్షన్లను ప్రవేశపెట్టింది. ఈ రిఫ్రెష్డ్ మోడళ్లను ప్రచారం చేసేందుకు గాను కంపెనీ ఓ కొత్త టెలివిజన్ కమర్షియల్ (టివిసి)ని విడుదల చేసింది. 'డ్రెస్డ్ టూ థ్రిల్' అనే థీమ్‌తో ఈ ప్రకటన ఉంటుంది.
బజాజ్ తమ పలర్స్ బ్రాండ్ క్రింద విక్రయిస్తున్న 200ఎన్ఎస్, 220, 180, 150సీసీ మోడళ్లలో కంపెనీ ఇటీవలే డ్యూయెల్ టోన్ (రెండు రంగుల కలయిక) వెర్షన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో తయారు చేసిన టెలివిజన్ కమర్షియల్‌ను కంపెనీ తొలిసారిగా ఫేస్‌బుక్‌లో విడుదల చేసింది. ఆ తర్వాత యూట్యూబ్ మరియు కొన్ని ఛానెళ్లలో దీనిని విడుదల చేసింది. మనం కూడా ఆ వీడియోని చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/UBoHZGMDfI0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








