రూ.20,000 వరకు తగ్గిన హ్యోసంగ్ బైక్‌ల ధరలు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కార్లు, మోటార్‌సైకిళ్లపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించిన నేపథ్యంలో, వరుసగా ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా.. డిఎస్‌కె హ్యోసంగ్ భారత్‌లో విక్రయిస్తున్న అన్ని ఉత్పత్తుల ధరలను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా తగ్గింపు తర్వాత హ్యాసంగ్ ద్విచక్ర వానాల ధరలు ఎక్స్-షోరూమ్ ధరపై మోడల్‌ను రూ.4,000 నుంచి రూ.20,000 వరకు తగ్గాయి. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని డిఎస్‌కె హ్యోసంగ్ స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా, డిఎస్‌కె హ్యోంగ్ చైర్మన్ శిరీష్ కులకర్ణి మాట్లాడుతూ.. ఎక్సైజ్ డ్యూటీలో తగ్గింపు ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని, ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ఇది ఆటోమొబైల్ పరిశ్రమకు చక్కటి ఊరట కలిగించిందని అన్నారు. ఈ ప్రయోజనాన్ని తాము తమ వినియోగదారులకు బదిలీ చేస్తామని, ఈ తగ్గింపు వలన మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడి, మంచి వృద్ధిని సాధించడం వీలవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం డిఎస్‌కె హ్యోసంగ్ దేశీయ విపణిలో అందిస్తున్న మోడళ్లు, వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* ఆక్విలా 250 - రూ.2.70 లక్షలు
* జిటి 250ఆర్ - రూ.2.80 లక్షలు
* జిటి 650ఎన్ - రూ.4.04 లక్షలు
* జిటి 650ఆర్ - రూ.4.87 లక్షలు
* ఆక్విలా ప్రో 650 - రూ.5.35 లక్షలు
* ఎస్‌టి 7 - రూ.6.10 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)


Click it and Unblock the Notifications