ఛండీఘడ్‌లో డిఎస్‌కే హ్యోసంగ్ కొత్త షోరూమ్ ప్రారంభం
ప్రముఖ కొరియన్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హ్యోసంగ్, భారత్‌లో మరో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. దేశీయ విపణిలో తమ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా, డిఎస్‌కే హ్యోసంగ్ ఛండీఘడ్‌లో నూతన షోరూమ్‌ను ప్రారంభించింది. తాజా షోరూమ్ ఏర్పాటుతో భారత్‌లో డిఎస్‌కే హ్యోసంగ్ షోరూమ్‌ల సంఖ్య 39కి చేరుకుంది.
ఛండీఘడ్ నార్త్ ఇండియాలో ప్రముఖమైన నగరాల్లో ఒకటని, ఇక్కడి వినియోగదారులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఛండీఘడ్‌లోని వాణిజ్య ప్రాంతమైన ఇండస్ట్రియల్ ఏరియా ప్లాట్ నెం.182/84, ఫేజ్ 1లో ఈ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో సేల్స్, సర్వీస్, స్పేర్స్ (3 ఎస్) సేవలను అందించనున్నారు.

దేశీయ విపణిలో డిఎస్‌కే హ్యోసంగ్ విక్రయిస్తున్న అన్ని శ్రేణుల మోటార్‌సైకిళ్లను ఈ షోరూమ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం హ్యోసంగ్ నుంచి లభిస్తున్న బైక్‌లు, వాటి ధరలు ఇలా ఉన్నాయి:
* ఆక్విలా 250 - రూ.2.75 లక్షలు
* జిటి 250ఆర్ - రూ.2.90 లక్షలు
* జిటి 650ఆర్ - రూ.4.63 లక్షలు
* ఆక్విలా ప్రో 650 - రూ.5.08 లక్షలు
* ఎస్‌టి 7 - రూ.5.79 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఛండీఘడ్)


Click it and Unblock the Notifications








