రూమర్: వచ్చే నెలలో హ్యోసంగ్ జిడి250ఎన్ విడుదల

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ 'హ్యోసంగ్' (Hyosung) భారత మార్కెట్లో మరో రెండు సరికొత్త 250సీసీ బైక్‌లను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

గడచిన నెలలో బెంగుళూరులో తమ రెండవ షోరూమ్‌ను ప్రారంభించిన సందర్భంగా డిఎస్‌కే హ్యోసంగ్ చైర్మన్ శిరీష్ కులకర్ణి మాట్లాడుతూ.. హ్యసంగ్ జిటి250 కామెట్ మరియు హ్యోసంగ్ జిడి 250ఎన్ అనే రెండు కొత్త 250సీసీ బైక్‌లను కంపెనీ విడుదల చేయనుందని తెలిపారు.

కాగా.. తాజాగా ఈ రెండు మోడళ్లలో ముందుగా హ్యోసంగ్ జిడి250ఎన్ వచ్చే నెలలో మార్కెట్లో విడుదల కావచ్చనే పుకార్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు మోడళ్లు అక్టోబర్ నాటికి మార్కెట్లోకి రావల్సి ఉంది. అయితే, అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే ఈ బైక్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Hyosung GD250N

హ్యోసంగ్ జిడి250ఎన్, కెటిఎమ్ డ్యూక్ రేంజ్‌ను పోలి ఉండే నేక్డ్ స్ట్రీట్ స్పోర్ట్ బైక్.ఇందులో ముందు వైపు 37 మి.మీ. ఇన్వెర్టెడ్ ఫోర్డ్ అప్ ఫ్రంట్ మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్లను అమర్చారు. దీని మొత్తం బరువు 145 కేజీలు. సికెడి రూట్లో దీనిని కూడా భారత మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేసే అవకాశాలున్నాయి. భారత మార్కెట్లో దీని ధర రూ.1.75 లక్షలు ఉండొచ్చని అంచనా.

హ్యోసంగ్ జిడి250ఎన్ బైక్‌లో 249సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 28 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జచేయబడి ఉంటుంది. ఇందులో 17 ఇంచ్ వీల్స్, 300 మి.మీ. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 230 మి.మీ. రియర్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 6, 2014, 17:59 [IST]
English summary
According to recent reports, the new Hyosung GD250N launch in India will happen next month. The Hyosung GD250N is powered by a 249cc, single cylinder, engine that pumps out a max power of 28 BHP and peak torque of 24 Nm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+