హ్యార్లీ డేవిడ్‌సన్‌ను వరించిన అత్యుత్తుమ పురస్కారం

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ కంపెనీ హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియాను అత్యుత్తమ ప్రతిభా అవార్డ్ దక్కింది. తయారీ విధానంలో కంపెనీ ప్రదర్శించిన అత్యుత్తమ నిర్వహణకు గాను 10వ ఇండో-అమెరికన్ ట్రేడ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2014 వరించింది. ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసిసి) నిర్వహించింది.

భారత్, అమెరికా దేశాలకు చెందిన వ్యాపార మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖులు, నిపుణులు మరియు మీడియా సమక్షంలో హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా ప్లాంట్ ఆపరేషన్స్ డైరెక్టర్ బల్జీత్ మోఖా ఈ అవార్డును అందుకున్నారు.

Harley Davidson India Gets Excellence Award

ఈ సందర్భంగా, బల్జీత్ మోఖా మాట్లాడుతూ.. మ్యానుఫాక్చరింగ్ భారతదేశపు ఆపరేషనల్ ఎక్సలెన్స్ అవార్డు ఏఐసిసి ద్వారా హ్యార్లీ డేవిడసన్‌కు తమకెంతో గర్వంగా ఉందని అన్నారు. కస్టమర్ల నుంచి సేకరించిన ఇన్‌పుట్స్, కట్టుబడి పనిచేసే తమ ఉద్యోగులు మరియు భాగస్వామ్యుల వల్లనే నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయటం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

భారతదేశంలో తాము గడచిన 5 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని బల్జీత్ మోఖా గుర్తు చేశారు. హ్యర్లీ డేవిడ్‌సన్‌కు భారత్‌లోని బవాల్ వద్ద అసెంబ్లింగ్ యూనిట్ ఉంది. 2010లో ప్రారంభమైన ఈ అసెంబ్లింగ్ యూనిట్‌లో ఇప్పుడు స్ట్రీట్ 750, స్ట్రీట్ 500 మోటార్‌సైకిళ్లను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. సికెడి రూపంలో విడిభాగాలను ఇక్కడికి దిగుమతి చేసుకొని అసెంబ్లింగ్ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 8, 2014, 14:15 [IST]
English summary
Harley-Davidson India received an award for 'operational excellence in manufacturing' at the 10th Indo-American Trade Excellence Awards 2014 organized by the Indo-American Chamber of Commerce (IACC).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+