ముంబైలో రెండవ డీలర్‌షిప్‌ను ప్రారంభించిన హ్యార్లీ డేవిడ్‌సన్
అమెరికాకు చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్‌సన్ ముంబైలో మరో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. సెవన్ ఐల్యాండ్స్ పేరుతో ముంబైలోని బాంద్రాలో ప్రారంభించిన ఈ డీలర్‌షిప్ ముంబైలో రెండవ హ్యార్లీ డేవిడ్‌సన్ డీలర్‌షిప్.
ముంబైలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లతో పాటుగా ఈ బ్రాండ్ దుస్తులు, విడిభాగాలు, యాక్ససరీలు మరియు రైడ్ గేర్‌లను కూడా ఆఫర్ చేయనున్నారు. బైక్ సర్వీసింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది.
షోరూమ్ వద్ద హ్యార్లీ ఓనర్ల బైక్‌లను ఆ షోరూమ్ సిబ్బందే పికప్/డ్రాప్ చేస్తారు. సెవన్ ఐల్యాండ్స్ షోరూమ్‌లో 'హ్యార్లీ ఓనర్స్ ఓన్లీ' అనే ఫీచర్ కూడా ఉంది. ఇందులో భాగంగా, కస్టమర్లు తమ బైక్‌లకు యాక్ససరీలను ట్రై చేయటం, బైక్‌లను కస్టమైజ్ చేయటం చేసుకోవచ్చు.
ముంబైలోని బాంద్రాలో ఏర్పాటైన సెవన్ ఐల్యాండ్స్ హ్యార్లీ డేవిడ్‌సన్ షోరూమ్‌లో కంపెనీ దేశీయ విపణిలో విక్రయిస్తున్న 11 రకాల మోడళ్లను అందుబాటులో ఉంచనున్నారు. హ్యార్లీ డేవిడ్‍సన్ బైక్స్ ప్రారంభ ధర రూ.4.3 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.



Click it and Unblock the Notifications








