హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్ కోసం ఈఎమ్ఐ స్కీమ్

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం హ్యార్లీ డేవిడ్‌సన్ ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ కోసం కంపెనీ ఓ సరికొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను పరిచయం చేసింది. ఇందుకోసం హెచ్‌డిఎఫ్‌సి మరియు ఐసిఐసిఐ బ్యాంకులతో హ్యార్లీ డేవిడ్‌సన్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా, స్ట్రీట్ 750 బైక్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లు హెచ్‌డిఎఫ్‌సి లేదా ఐసిఐసిఐ బ్యాంకుల ద్వారా రుణాన్ని పొందినట్లయితే, పూర్తి రుణ మొత్తంపై ప్రాసెసింగ్ ఫీజును మినహాయిస్తారు. అలాగే, కేవలం రూ.91,471ల డౌన్‌పేమెంట్ చెల్లించి ఈ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ప్రతినెలా రూ.8,309ల చొప్పున ఐదేళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యాక్ససరీలకు కూడా ఫైనాన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. స్ట్రీట్ 750 కొనుగోలుపై రూ.50,000 వరకు మరియు ఇతర మోడళ్లపై రూ.2 లక్షల వరకు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తుంది. స్ట్రీట్ 750 బైక్ 57 యాక్ససరీ ఆప్షన్లను అందుబాటులో ఉంచారు.

Harley Davidson Street 750

దేశీయ విపణిలో హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్ ధర రూ.4.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మార్చ్ 1, 2014వ తేది నుంచి ఈ మోడల్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 13 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఈ కొత్త మోడల్‌ను విక్రయించనున్నారు.

క్రూయిజర్ స్టైల్‌లో ఉండే ఈ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్‌లో టియర్ డ్రాప్ షేపులో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్స్, ఎలాంగేటెడ్ బాడీ, రౌండెడ్ బికినీ ఫెయిరింగ్, వి-ట్విన్ ఇంజన్స్ వంటివి ప్రత్యేకతలున్నాయి. హ్యార్లీ డేవిడ్‌సన్ తెలిపిన దాని ప్రకారం, ఈ కొత్త స్ట్రీట్ సిరీస్ మోటార్‌సైకిళ్లను ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది యువకుల నుంచి అందుకున్న ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసారు.


స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఇది హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి గడచిన 13 ఏళ్ల తర్వాత లభిస్తున్న సరికొత్త బైక్‌ కావటం విశేషం. ఇది సరికొత్త బ్లాక్ స్టయిలింగ్‌తో లభ్యం కానుంది. హ్యార్లీ దీనిని 'డార్క్ కస్టమ్' అని పిలుస్తోంది. బ్లాక్ కలర్ ఇంజన్, బ్లాక్ కవర్స్, బ్లాక్ పుల్‌బ్యాక్ హ్యాండిల్‌ బార్స్, బ్లాక్ ఫోర్క్ గైటర్స్ మరియు లోవర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

అంతేకాకుండా, ఈ బైక్‌లోని సైలెన్సర్ కూడా పూర్తిగా నలుపు రంగులోనే ఉంటుంది. హ్యార్లీ 70వ దశకంలో ఒరిజినల్ కెఫే రేస్ మోటార్‌సైకిళ్లలో ఈ తరహా సైలెన్సర్లను ఉపయోగించింది. ఆ తర్వాత ఇదే మొదటిసారి. హ్యార్లీ 'రెవల్యూషన్ ఎక్స్' అని పిలిచే లిక్విడ్ కూల్డ్ వి-ట్విన్ ఇంజన్‌ను ఈ బైక్‌లో ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. రెగ్యులర్ హెచ్‌డి బైక్‌ల మాదిరిగానే ఇది కూడా బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తోనే లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 20, 2014, 17:06 [IST]
English summary
Harley Davidson India, is prepared to make their cruisers more accessible to enthusiasts around the country. Bikers who have booked the Street 750 from Harley Davidson, will receive their cruisers in March. However, the surprise is people who have opted for loans from HDFC or ICICI bank will have their processing fees waived off.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+