అవెంజర్స్ సినిమాలో హ్యార్లీ డేవిడ్‌సన్ లైవ్‌వైర్

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ హ్యార్లీ డేవిడ్‌సన్ ఇటీవలే తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'లైవ్‌వైర్'ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ అమెరికన్ కంపెనీ బైక్‌లను ఇప్పటికే అనేక సినిమాల్లో ఉపయోగించిన సంగతి తెలిసినదే. మార్వెల్ కామిక్ బుక్ క్యారెక్టర్ కెప్టెన్ అమెరికా కూడా హ్యార్లీ బైక్‌ను ఉపయోగించాడు.

ఇది కూడా చదవండి: కొత్త లిథయం అయాన్ బ్యాటరీల రేంజ్ 7 రెట్లు అధికం

కాగా.. తాజాగా వస్తున్న అవెంజర్స్ సిరీస్ 'ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్' చిత్రంలో కూడా అతను ఈ ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ బైక్‌ను ఉపయోగించనున్నాడు. ఈ బైక్ ముందు వైపు హెడ్‌లైట్ స్థానంలో కెప్టెన్ అమెరికా షీల్డ్ ఉంటుంది. అయితే, ఈ సినిమాలోని అనేక సన్నివేశాల్లో బ్లాక్ విడో పాత్ర పోషిస్తున్న స్కార్లెట్ జాన్సన్ ఈ హ్యార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ లైవ్‌వైర్ బైక్‌ను నడపటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Harley LiveWire

అవెంజర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ చిత్రంలో ఉపయోగించిన హ్యార్లీ డేవిడ్‌సన్ లైవ్‌వైర్ ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ బైక్‌ను శాన్ డీగోలో నిర్వహించిన అవెంజర్స్ లైవరీ కామిక్-కాన్ వద్ద ప్రదర్శనకు ఉంచారు. అయితే, ఈ చిత్రంలో ఈ మోటార్‌సైకిల్ పాత్ర ఎంత మేర ఉంటుందనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.

ఇక హ్యార్లీ డేవిడ్‌సన్ లైవ్‌వైర్ ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ విషయానికి వస్తే, దీనిని క్లీన్ అండ్ స్లీక్ డిజైన్‌తో క్యారక్టరైజ్ చేశారు. కార్లలో మాదిరిగా ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లను ఇందులో జోడించారు. ఎల్‌సిడి డిస్‌ప్లేతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఇందులో మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.


లైవ్‌వైర్ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఇతర హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది, ఇందులో డబుల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ ఉంటుంది. హ్యార్లీ డేవిడ్‌సన్ లైవ్‌వైర్‌లో ట్రాన్సిమిషన్ ఉండదు, గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే ఈ బైక్ 4 సెకన్ల వ్యవధిలో గంటకు 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.

ఇది కూడా చదవండి: ఆగస్ట్ 5న ఫియట్ పుంటో ఇవో విడుదల

ఇందులో ఓ త్రీ ఫేస్ ఏసి ఇండక్షన్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 74 హార్స్ పవర్‌ల శక్తిని, 70 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని రేంజ్ 210 కిలోమీటర్లు. బ్యాటరీలను రీచార్జ్ చేయటానికి పట్టే సమయం అరగంట నుంచి గంట వరకూ మాత్రమే. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ వెర్షన్ మాత్రమే. ఈ మోడల్‌పై వినియోగదారులు, నిపుణుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఫైనల్ ప్రొడక్షన్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Most Read Articles

English summary
Harley Davidson had recently unveiled their first electric project named 'LiveWire'. The American motorcycle is popular and has been used in several movies. Even Marvel comic book character Captain America uses a Harley Davidson. In the latest edition of the Avengers series 'Age of Ultron', he will be riding the electric prototype.
Story first published: Wednesday, July 30, 2014, 14:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X