నవంబర్ 15 నుంచి హ్యార్లీ రాక్ రైడర్స్ సీజన్ 5 ప్రారంభం
అమెరికన్ మోటార్‌సైకిల్ దిగ్గజం హ్యార్లీ డేవిడ్‌సన్ తరచూ గ్రూప్ రైడ్స్ నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. తాజాగా హ్యార్లీ డేవిడ్‌సన్ వచ్చే నెల 15వ తేదీ నుంచి 'హ్యార్లీ రాక్ రైడర్స్ సీజన్ 5'ను ప్రారంభించనుంది. ఈ రాక్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను హ్యార్లీ డేవిడ్‌సన్ మరియు 'ఓన్లీ మచ్ లౌడర్'లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
ఈ కార్యక్రమం ముంబైలోని బైకల్లా వద్ద ఉన్న రిచర్డ్‌సన్ అండ్ క్రుడ్డాస్ ఫౌండ్రీ వద్ద నవంబర్ 15, 16వ తేదీలలో జరగనుంది. ఈ రెండు రోజుల పాటు దాదాపు 20 బ్యాండ్స్ రెండు స్టేజ్‌లపై ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. ఆసక్తి కలిగిన హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్ యజమానులంతా ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనవచ్చు. ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌కి వందలాది సంఖ్యలో హ్యార్లీ ఓనర్లు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
హ్యార్లీ రాక్ రైడర్స్ కోసం టికెట్లను www.insider.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే ఈ టికెట్లను బాంద్రా మరియు టర్బే ప్రాంతాల్లో ఉన్న హ్యార్లీ డేవిడ్‌సన్ షోరూమ్‌ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. ఒక్క రోజు కోసం టిక్కెట్ ధర రూ.999 మరియు సీజన్ టికెట్ ధర రూ.1,500గా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.



Click it and Unblock the Notifications








