క్యూ3లో 8 శాతం పెరిగిన హీరో మోటోకార్ప్ లాభం

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ డిసెంబర్ 31, 2013తో ముగిసిన 3వ త్రైమాసికానికి గాను నికరల లాభంలో 7.53 శాతం వృద్ధిని సాధించామని పేర్కొంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.487.89 కోట్లుగా నమోదు కాగా, ఈ ఏడాది అది రూ.524.66 కోట్లకు పెరిగిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక ఇదే కంపెనీ అమ్మకాలు 11 శాతం వృద్ధి చెంది రూ.6,151 కోట్ల నుంచి రూ.6,846 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో మొత్తం 16,80,940 వాహనాలను విక్రయించినట్లు హీరో మోటోకార్ప్ వివరిచింది. కాగా.. గతంలో ఇదే కాలానికి 15,73,135 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

Hero HX250R

మార్కెట్ మందగమన వాతావరణంలోను అమ్మకాలను పెంచుకోగలిగామని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పవన్ ముంజాల్ వ్యాఖ్యానించారు. కానీ, లోహాల ధరలు పెరగడం, కరెన్సీ హెచ్చుతగ్గుల వంటి పలు కారణాల ఆశించిన రీతిలో లాభాలను సాధించలేకపోయామని ఆయన తెలిపారు.

కాగా.. తాము కొత్తగా టాంజానియా, ఉగాండా, ఈజిప్ట్ తదితర నూతన మార్కెట్లకు వాహన ఎగుమతులను ప్రారంభించామని, లాటిన్ మార్కెట్లలో తమ వాహనాలను విక్రయించేందుకు వీలుగా కొలంబియాలో ఓ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Friday, January 31, 2014, 10:36 [IST]
English summary
The country's largest two-wheeler maker Hero MotoCorp has reported a 7.53 per cent increase in profit after tax to Rs 524.66 crore for the third quarter ended December 31 on robust sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+