కొలంబియాలో కొత్త ప్లాంట్‌కు శంఖుస్థాపన చేసిన హీరో మోటోకార్ప్

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, 2020 నాటికి దాదాపు 50 దేశాల్లో తమ కాలు మోపాలనే లక్ష్యంలో భాగంగా, తాజాగా కొలంబియా మార్కెట్లోకి ప్రవేశించింది. హీరో మోటోకార్ప్ గ్లోబల్ ఎక్స్‌పాన్షన్ ప్లాన్ (ప్రపంచ విస్తరణ ప్రణాళిక)లో భాగంగా, కొలంబియాలో ఓ అధునాతన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

కొలంబియాలో ఏర్పాటు చేయనున్న ఈ అధునాత ఉత్పత్తి కేంద్రానికి ఆ సంస్థ అధినేత పవన్ ముంజాల్ శంకుస్థాపన చేశారు. కొలంబియా ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు, కంపెనీ ఉన్నతాధికారులు మరియు ఇతర ప్రముఖులు సమక్షంలో హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ ముంజాల్ పునాది రాయి వేసి ఈ ప్లాంట్ పనులు ప్రాంభించారు.

Hero MotoCorp Sets Foundation Stone In Colombia

ఈ ప్రాజెక్ట్ ఖర్చు 70 మిలియన్ అమెరికన్ డాల్రు. ఇందులో 38 మిలియన్ డాలర్లను కంపెనీ క్యాపిటల్‌గా వెచ్చించనుంది. మిగిలిన మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్‌గా రానున్న మూడేళ్ల కాలం పాటు వినియోగించనుంది. ఈ ఈక్విటీ పెట్టుబడిని హీరో మోటోకార్ప్ లిమిటెడ్ పూర్తి నెథర్లాండ్స్ అనుబంధ సంస్థ హెచ్ఎమ్‌సిఎల్ బివి ద్వారా వెచ్చించనున్నారు.

కొలంబియాలో సుమారు 17 ఎకరాల (68,000 చ.అ.) విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ 2015 మధ్య భాగం నాటికి అందుబాటులోకి రావచ్చని అంచనా. ఈ ప్లాంట్ ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 78,000 యూనిట్లు. భవిష్యత్తులో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.50 లక్షల యూనిట్లకు పెంచనున్నారు. హీరో మోటోకార్ప్ తమ గ్లోబల్ ఫుట్‌ప్రింట్ కోసం అనేక దేశాలలో కార్యకలపాలాను ప్రారంభించి ప్రపంచపు నెంబర్ వన్ టూవీలర్ కంపెనీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, July 7, 2014, 17:22 [IST]
English summary
India's largest selling two wheeler manufacturer Hero MotoCorp is on a mission of domestic as well as global expansion. They have made their intentions clear to sell their motorcycles in over 50 countries by 2020. However, on 6th July, 2014 Hero MotoCorp set the foundation stone of its new facility in Villa Rica, Cauca, Colombia.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+