హీరో హెచ్ఎక్స్250ఆర్‌‌లో మాగ్నెటి మారెల్లీ ఫ్యూయెల్ ఇంజెక్టర్

By Ravi

భారత ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, తమ అమెరికన్ భాగస్వామి ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ (ఈబిఆర్) సహకారంతో రూపొందించిన 250 సీసీ స్పోర్ట్స్ బైక్ 'హీరో హెచ్‌ఎక్స్‌250ఆర్' (Hero HX250R)లో మెరుగైన మైలేజ్ కోసం కంపెనీ ఇందులో ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఉపయోగించనుంది.

హీరో హెచ్‌ఎక్స్‌250ఆర్ బైక్‌లో ఉపయోగించనున్న ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను, ఇటలీకి చెందిన కాంపోనెంట్ మేకర్ మాగ్నెటి మారెల్లీ నుంచి గ్రహించనున్నారు. మాగ్నెటి మారెల్లీ ఇప్పటికే మోటోజిపిలో అనేక కాంపోనెంట్లను ఆఫర్ చేస్తోంది. ఇదే సంస్థ మనదేశంలోని ఏఎమ్‌టి కార్లకు అవసరమైన కిట్‌లను కూడా సప్లయ్ చేస్తోంది.


ఈ బైక్‌లో ఉపయోగించిన 250సీసీ ఇంజన్ గరిష్టంగా 31 పిఎస్‌‌ల శక్తిని, 26 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది కేవలం 2.7 సెకండ్ల వ్యవధిలోనే 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

అండర్ సీట్ ఎగ్జాస్ట్ (సీటు క్రింద ఉండే సైలెన్సర్) ఇందులో ప్రధాన ప్రత్యేకత. ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇగ్నిషన్ సిస్టమ్, కాంబినేషన్ ఆఫ్ ఏబిఎస్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఈ బైక్ బరువు కేవలం 139 కిలోలు మాత్రమే.

Magneti Marelli Fuel Injector

హీరో మోటోకార్ప్ ఈ గ్లోబల్ ప్రోడక్ట్ (హెచ్ఎక్స్250ఆర్)కు ఇటీవలే అమెరికా, యూరప్‌లో పేటెంట్ కూడా చేసుకుంది. ఈ బైక్ భారత్‌లో విడుదలైన తక్షణమే, అమెరికన్ మార్కెట్లలో కూడా విడుదల కానుంది. అయితే, అమెరికాలో ఇది హీరో బ్రాండ్‌తో అమ్ముడవుతుందా లేక ఈబిఆర్ బ్యాడ్జ్‌తో అమ్ముడుపోతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

హీరో హెచ్ఎక్స్250ఆర్ అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్300ఆర్, యమహా ఆర్3, కవాసకి నిన్జా 300 మోడళ్లతోను, దేశీయ మార్కెట్లో కెటిఎమ్ ఆర్‌సి200, హోండా సిబిఆర్ 250ఆర్ వంటి మోడళ్లతోనూ పోటీపడుతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి. ఈలోపుగా ఈ బైక్ టీజర్ వీడియోని వీక్షించండి..!

More from DriveSpark

Article Published On: Tuesday, November 11, 2014, 17:52 [IST]
English summary
Hero MotoCorp will providing their motorcycle HX250R with fuel injection system for maximum fuel efficiency. Hero MotoCorp. will be seeking this component from Italian component provider Magneti Marelli.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+