లీప్ హైబ్రిడ్ స్కూటర్‌తో యూరప్‌లోకి ప్రవేశించనున్న హీరో
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వచ్చే ఏడాది చివరి నాటికి యూరోపియన్ మార్కెట్లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూరప్‌లోని ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ మార్కెట్లలో తమ హైబ్రిడ్ స్కూటర్ 'లీప్'ను విడుదల చేయటం ద్వారా ఆయా మార్కెట్లలోకి ప్రవేశించి, పట్టు సాధించాలని హీరో మోటోకార్ప్ భావిస్తోంది.
హీరో మోటోకార్ప్ తమ లీప్ హైబ్రిడ్ స్కూటర్‌ను తొలిసారిగా 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. మొదటి దశలో భాగంగా యూరోప్‌లోని ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లలో తమ ఉత్పత్తులను విడుదల చేసిన తర్వాత, రెండవ దశలో భాగంగా బ్రిటన్ మరియు జర్మనీ మార్కెట్లలోకి కూడా ప్రవేశిస్తామని హీరో మోటోకార్ప్ లిమిటెడ్ (హెచ్‌ఎమ్‌సిఎల్) ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ మార్కెట్లలో ముందుగా సీరియల్-హైబ్రిడ్ స్కూటర్ లీప్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మరిన్ని స్కూటర్లు, మోటార్‌సైకిళ్లను ఆయా మార్కెట్లకు పరిచయం చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అండ్ సెంట్రల్ అమెరికాలలోకి విజయవంతంగా ప్రవేశించిన తాము, 2015 చివరి నాటికి యూరోపియన్ మార్కెట్లలోకి ప్రవేశిస్తామని, తమ సరికొత్త హైబ్రిడ్ స్కూటర్ లీప్ ద్వారా ఈ మార్కెట్లలోకి ప్రవేశించబోతున్నామని హీరో మోటోకార్ప్ లిమిటెడ్ వైస్ చైర్మన్, సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ తెలిపారు.
ఈ మార్కెట్లలో వేగంగా ప్రవేశించేందుకు హీరో మోటోకార్ప్ ఓ స్థానిక భాగస్వామిని కోసం అన్వేషిస్తోంది. అవసరమైతే ఏదైనా లోకల్ కంపెనీని విలీనం చేసుకోవడం లేదా టేకోవర్ చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉంది. యూరోపియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తే తాము ఓ గ్లోబల్ బ్రాండ్‌గా మరింత పేరు పొందుతామని, ఇదే తమ దీర్ఘకాలిక వ్యూహమని పవన్ ముంజాల్ చెప్పారు.

హీరో మోటోకార్ప్ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేస్తామని, ప్రపంచంలోని అన్నీ దేశాలకు తమ ఉత్పత్తులను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని ముంజాల్ చెప్పారు. 2020 నాటికి హీరో ప్రపంచంలోని మొత్తం 50 దేశాలకు విస్తరించాలనే లక్ష్యం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 20 కంటే ఎక్కువ దేశాల్లో అసెంబ్లింగ్ యూనిట్లు చేపట్టాలని నిర్ణయించింది.
అలాగే కొలంబియా, బంగ్లాదేశ్‌లలో మోటార్‌సైకిళ్ల ప్లాంట్‌లను ఏర్పాటు చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఇక్కడ ఉత్పత్తి కూడా మొదలుపెడుతుంది. స్థానిక భాగస్వామితో పాటు స్థానిక పంపిణీదారునితో కలిసి హీరో మోటోకార్ప్ కెన్యా, టాంజానియా, ఉగాండాల్లో అసెంబ్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ ఇప్పటికే వచ్చే కొన్ని సంవత్సరాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి 800 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. హీరో మోటోకార్ప్ ప్రస్తుతం సుమారు 20 దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








