హీరో మోటోకార్ప్ నుంచి కొత్త బైక్, స్కూటర్ లాంచ్
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ నేడు రెండు సరికొత్త మోడళ్లను దేశీయ విపణిలో విడుదల చేయనుంది. ఇందులో ఓ కొత్త స్కూటర్ మరియు ఓ కొత్త మోటార్‌సైకిల్ ఉండనున్నాయి. కంపెనీ ఈ ఏడాదిలో విడుదల 15 కొత్త/అప్‌గ్రేడెడ్ ఉత్పత్తులో భాగంగానే ఈ రెండు మోడళ్లను నేడు విడుదల చేయనున్నారు.
ఈ రెండు కొత్త ఉత్పత్తుల విడుదలకు సంబంధించి హీరో మోటోకార్ప్ రెండు టీజర్ ఫొటోలను విడుదల చేసింది. మోటార్‌సైకిల్ టీజర్‌ను బట్టి చూస్తుంటే, కంపెనీ విడుదల చేయనున్న ఈ మోటార్‌సైకిల్ సరికొత్త హంక్ అని తెలుస్తోంది. ఎందుకంటే, గడచిన అక్టోబర్ నెలలో హీరో మోటోకార్ప్ ప్రదర్శించిన కొత్త ఉత్పత్తుల్లో హీరో హంక్ లేదు కాబట్టి, నేడు విడుదల కాబోయేది హంక్ అని అంచనా.

ఇక స్కూటర్ టీజర్ ఫొటో విషయానికి వస్తే, 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన హైబ్రిడ్ స్కూటర్ కాన్సెప్ట్ 'హీరో లీప్'కు ఇది ప్రొడక్షన్ వెర్షన్ అని తెలుస్తోంది. ఈ స్కూటర్ వెనుక వీల్ డిజైన్‌ను బట్టి చూస్తే ఇది స్పష్టమవుతుంది. మరికొద్ది సేపట్లో ఈ రెండు మోడళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడి కానుంది.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 5, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న 12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హీరో మోటోకార్ప్ తమ సరికొత్త ఉత్పత్తుల శ్రేణిని పరిచయం చేయనుంది. ఈరోజు విడుదల చేయబోయే కొత్త ఉత్పత్తులను కంపెనీ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








