మార్చ్ నెలలో హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్, ప్యాషన్ ప్రో టిఆర్ లాంచ్

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గడచిన ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2014లో ఆవిష్కరించిన కెఫే రేసర్ స్టయిల్ 'హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్' మరియు ఆఫ్-రోడర్ స్టయిల్ 'ప్యాషన్ ప్రో టిఆర్' మోటార్‌సైకిళ్లను ఈ నెలలోనే (మార్చ్ 2014) మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమచారం.

కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్‌ను తలపించేలా (రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మాదిరిగా) హీరో మోటోకార్ప్ తమ 100సీసీ బైక్ స్ప్లెండర్ ప్రోను తీర్చిదిద్దింది. రౌండ్ హెడ్‌ల్యాంప్, స్టీల్ మడ్‌గార్డ్, కెఫే రేసర్ స్టైల్ సీట్ కౌల్‌తో ఇది క్లాసిక్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ స్ప్లెండర్ ప్రో క్లాసిక్‌లో కెఫే రేసర్ స్టైల్ బాడీ కలర్, రౌండ్ స్టీల్ రియర్ వ్యూ మిర్రర్స్, రౌండ్ టర్న్ ఇండికేటర్స్‌తో ఇది క్లాసిక్ కెఫే రేసర్ బైక్‌ను తలపిస్తుంది.


ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్ప్లెండర్ సిరీస్ బైక్‌లలో ఉపయోగిస్తున్న 97.2 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజనే ఇందులోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 7.7 బిహెచ్‌పిల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 8.04 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
Passion Pro TR

ఇకపోతే ప్యాషన్ ప్రో టిఆర్ విషయానికి వస్తే, ప్రస్తుతం హీరో మోటోకార్ప్ అందిస్తున్న 100సీసీ బైక్ ప్యాషన్ ప్రోను ఆధారంగా చేసుకొని ఆఫ్-రోడర్ స్టయిల్‌లో ఈ బైక్‌ను డిజైన్ చేశారు. థ్రెడ్ వీల్స్, రైజ్డ్ ఫ్రంట్ ఫెండర్స్, హెడ్‌ల్యాంప్ గ్రిల్, ఇంజన్ గార్డ్, ఫ్యూయెల్ ట్యాంక్ ప్యాడ్స్, హ్యాండ్ గార్డ్‌లను ఇందులో గమనించవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 5, 2014, 18:11 [IST]
English summary
Hero MotoCorp have confirmed launch of a at least two new motorcycles which will take place this fiscal. These are in the form of Splendor Pro Classic Cafe Racer, and Passion Pro TR. Both of these were showcased at the recently concluded Delhi Auto Expo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+