గుజరాత్‌లో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద స్కూటర్ ప్లాంట్: హోండా

By Ravi

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) ప్రపంచంలో కెల్లా అతిపెద్ద స్కూటర్ ప్లాంట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

కాగా.. హోండా ఇప్పుడు ఆ ప్లాంట్‌కు పునాదిరాయి నాటి, భూమిపూజ చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉన్న వితలపూర్ వద్ద హోండా ఈ స్కూటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. హోండా ఇది భారతదేశంలో నాల్గవ ఉత్పత్తి కేంద్రం. అంతేకాకుండా, హోండాకు ఇదే ప్రపంచంలో కెల్లా అతిపెద్ద స్కూటర్ ప్లాంట్ కావటం మరో విశేషం.

ఈ స్కూటర్ ప్లాంట్ కోసం హోండా సుమారు రూ.1100 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. వచ్చే ఏడాది (2015) చివిరి నాటికి ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో నిర్వహణలోకి రానుంది. ప్రారంభంలో భాగంగా ఈ ప్లాంట్‌లో సాలీనా 1.2 మిలియన్ యూనిట్ల (12 లక్షల) స్కూటర్లను ఉత్పత్తి చేయనున్నారు. దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు.

Honda Brings The Worlds Largest Only Scooter Plant To Gujarat
Most Read Articles

English summary
Honda Motorcycle & Scooter India Pvt. Ltd. (HMSI), today held the foundation stone laying ceremony and ‘Bhoomi-poojan’ for its landmark fourth manufacturing plant at Vithalapur (Mandal taluk, Ahmedabad district, Gujarat) in India.
Story first published: Thursday, October 16, 2014, 18:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X