హోండా సిబి డాజ్లర్ కథ ముగిసింది..!

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) దేశీయ విపణిలో అందిస్తున్న 150సీసీ మోటార్‌సైకిల్ సిబి డాజ్లర్‌ను కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. దీన్నిబట్టి చూస్తుంటే, హోండా యునికార్న్ డాజ్లర్ అమ్మకాలను కంపెనీ నిలిపివేసినట్లు తెలుస్తోంది.

హోండా అందిస్తున్న రెగ్యులర్ యునికార్‌కు ప్రీమియం వెర్షన్‌గా డాజ్లర్‌ను ప్రవేశపెట్టటం జరిగింది. ఈ రెండు బైక్‌లలో ఉపయోగించిన 150సీసీ ఇంజన్ ఒక్కటే, కానీ వీటి డిజైన్ మాత్రం వేర్వేరుగా ఉంటుంది. వాస్తవానికి సిబి డాజ్లర్ డిజైన్ కొనుగోలుదారులను ఆకట్టుకోవటం విఫలమైందని చెప్పాలి. రెగ్యులర్ యునికార్న్ అమ్మకాలు సాగినట్లుగా డాజ్లర్ అమ్మకాలు సాగలేదు.


అందుకే, కంపెనీ ఈ మోడల్‌ను తమ పోర్ట్ ఫోలియో నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. హోండా సిబి డాజ్లర్‌లో 149సీసీ ఇంజన్ ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 14 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ బైక్‌లో బేస్ వెర్షన్ రూ.66,750 ధరకు అందుబాటులో ఉండేది.

డాజ్లర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కంపెనీ తమ సరికొత్త 150సీసీ బైక్ సిబి ట్రిగ్గర్‌ను ప్రవేశపెట్టింది. ఇది మూడు వేరియంట్లలో (స్టాండర్డ్, డిఎల్ఎక్స్, సిబిఎస్) లభిస్తోంది. దీని ధరలు రూ.72,431 నుంచి రూ.82,386 మధ్యలో ఉన్నాయి. హోండా సిబి ట్రిగ్గర్‌లో అమర్చిన 149సీసీ ఫోర్-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 13.81 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 12.5 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

Honda CB Trigger

ఈ బైక్‌లో వినూత్నమైన 3డి హోండా యాంబ్లమ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఎల్‌ఈడి టెయిల్ లైట్, హై క్వాలిటీ మోనో సప్సెన్షన్, 240 మి.మీ. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 220 మి.మీ. రియర్ డిస్క్ బ్రేక్, వెడల్పాటి ట్యూబ్‌లెస్ టైర్స్, మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్ వంటి ఫీచర్లున్నాయి. ఈ బైక్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో (మెటోర్ గ్రీన్ మెటాలిక్, పెరల్ సీనా రెడ్ మరియు బ్లాక్ కలర్స్) లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 31, 2014, 17:08 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+