చోటా భీమ్‌తో చేతులు కలిపిన హోండా మోటార్‌సైకిల్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కార్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) పిల్లల్లో రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించేందుకు పొగో చిన్న పిల్లల టెలివిజన్‌లో ప్రసారమయ్యే చోటా భీమ్ అనే కార్టూన్ ప్రోగ్రామ్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా, చోటా భీమ్ దుస్తులు ధరించిన మస్కట్ రోడ్ సేఫ్టీ గురించి ప్రమోషన్ చేయనుంది.
చిన్నతనం నుంచే పిల్లల్లో రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం ద్వారా వారు పెద్దయ్యాక రోడ్డపై క్రమశిక్షణతో వ్యవహరిస్తారనే ఉద్దేశ్యంతో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు హోండా ఓ ప్రకటనలో పేర్కొంది. పోగో కార్టూన్ ఛానెల్‌లో ప్రసారమయ్యే చోటా భీమా కార్టూన్ షో ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులరాటీని తెచ్చుకుంది. ప్రత్యేకించి మనదేశంలో ఇది పలు భాషల్లో ప్రసారమవుతూ, పిల్లల్లో మంచి ఆదరణను తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో, తమ సేఫ్టీ క్యాంపైన్ కోసం చోటా భీమ్ క్యారెక్టర్ చక్కగా సూట్ అవుతుందని హోండా భావించింది. దేశవ్యాప్తంగా 11 నగరాల్లో 'హోండా సేఫ్ రైడింగ్ విత్ చోటా భీమ్' అనే పేరిట ఈ క్యాంపైన్‌ను నిర్వహించనున్నారు. ఇందులో చోటా భీమ్ క్యారెక్టర్ పిల్లలతో మమేకమై వారికి సేఫ్ రైడింగ్ గురించి అవాగహన కల్పించనుంది. ఢిల్లీ, జైపూర్, ఇండోర్, లక్నో, భువనేశ్వర్, కోల్‌కటా, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, గ్రేటర్ నోయిడా, నాగ్‍పూర్‌లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇటీవలే యమహా మోటార్ ఇండియా కూడా ఈ తరహా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసినదే. ఇందుకోసం యమహా తమ బ్రాండ్ మస్కట్‌ను కూడా ఆవిష్కరించింది. అయితే, యమహా ఈ తరహా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన రెండు రోజుల్లోపే హోండా కూడా చోటా భీమ్ సేఫ్టీ క్యాంపైన్‌ను ప్రారంభించడం గమనార్హం.


Click it and Unblock the Notifications








