హోండా డ్రీమ్ నియో సూపర్‌స్టార్ కాంటెస్ట్ విజేతల వివరాలు వెల్లడి
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) తమ లాయల్ డ్రీమ్ నియో కస్టమర్లతో ఎంగేజ్ అయ్యేందుకు గాను నిర్వహించిన 'డ్రీమ్ నియో సూపర్‌స్టార్ కాంటెస్ట్' విజేతల వివరాలను కంపెనీ వెల్లడి చేసింది. న్యూఢిల్లీకి చెందిన సుధీర్ కుమార్ 'డ్రీమ్ నియో సూపర్‌స్టార్ కాంటెస్ట్' విజేతగా నిలిచినట్లు హెచ్ఎమ్ఎస్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
డ్రీమ్ నియో సూపర్‌స్టార్ కాంటెస్ట్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 20 మంది విజేతలుగా నిలిచారని, వీరందరూ ప్రముఖ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ని కలుసుకునే అవకాశాన్ని పొందనున్నారని హోండా తెలిపింది. ఈ కాంటెస్ట్‌కి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించిందని, పది వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వివరించింది.

భారత్‌లో హోండా నిర్వహించిన అతిపెద్ద కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్రణాళిక అయిన డ్రీమ్ నియో సూపర్‌స్టార్ కాంటెస్ట్ ద్వారా కంపెనీ అందిస్తున్న డ్రీమ్ నియో మోటార్‌సైకిల్ విజయాన్ని జరుపుకున్నామని, ఏప్రిల్ 2013లో డ్రీమ్ నియో మోటార్‌సైకిల్‌ను తొలిసారిగా విడుదల చేశామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బైక్ మంచి విజయాన్ని కనబరుస్తోందని హోండా తెలిపింది.


Click it and Unblock the Notifications








