భారత్‌లో చవక ధరకే పెర్ఫార్మెన్స్ బైక్స్‌ని ఆఫర్ చేయనున్న హోండా
జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్, భారత మార్కెట్లో మరిన్ని పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ పెర్ఫార్మెన్స్ బైక్‌లను ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయటం, వీటి ఉత్పత్తిలో ఎక్కువ శాతం లోకలైజేషన్ చేయటం ద్వారా సరసమైన ధరకే వీటిని అందించాలని కంపెనీ భావిస్తోంది.
ఇందులో భాగంగా, హోండా ముందుగా సిబిఆర్ సిరీస్‌లో ఓ కొత్త హోండా సిబిఆర్650 మోడల్‌ని విడుదల చేయనుంది. ప్రస్తుతం, హోండా భారత మార్కెట్లో ఆఫర్ చేస్తున్న పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లన్నింటినీ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. ఫలితంగా వీటిపై అధిక దిగుమతి సుంకాలు వర్తిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, ఇంపోర్టెడ్ హోండా పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్ల ధరలు కూడా అధికంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం దేశీయ విపణిలో హోండా విక్రయిస్తున్న పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్ల ధరలు రూ.14 లక్షల నుంచి రూ.31 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. కాగా.. హోండా తమ కొత్త సిబిఆర్650 మోడల్‌ని రూ.10 లక్షల కన్నా తక్కువ ధరకే అందించడం ద్వారా పెర్ఫార్మెన్స్ బైక్ మార్కెట్లో గట్టి పట్టును సాధించాలని భావిస్తోంది.

భారతదేశంలో కమ్యూటర్ మోటార్‌సైకిళ్లకే ఎక్కువ మార్కెట్ వాటా ఉందని, అయినప్పటికీ తాము హై-ఎండ్ మోటార్‌సైకిల్ విభాగంలా కూడా మంచి పట్టును సాధించాలని చూస్తున్నామని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ కీటా మరమత్సు తెలిపారు. హై-ఎండ్ మోటార్‌సైకిళ్లను భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయటం ద్వారా, సరసమైన ధరకే ఉత్పత్తులను అందించాలనేదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.
వచ్చే ఏడాది ద్వితీయార్థంలో హోండా సిబిఆర్650 మోడల్‌ను విడుదల చేస్తామని, దీనిని భారత్‌లోనే అసెంబ్లింగ్ చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం హోండా దేశీయ విపణిలో విక్రయిస్తున్న హై-ఎండ్ మోటార్‌సైకిళ్లలో గోల్డ్ వింగ్ 1800, విటి1300 సిఎక్స్, విఎఫ్ఆర్1200ఎఫ్, సిబిఆర్1000 ఆర్ఆర్, సిబి1000 ఆర్ మోడళ్లున్నాయి.


Click it and Unblock the Notifications








