హోండా స్కూటర్ అమ్మకాలకు నో బ్రేక్స్
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో స్కూటర్లకు గిరాకీ నానాటికీ పెరుగుతోంది. ఈ సెగ్మెంట్లో లీడర్‌గా ఉన్న హోండా, స్కూటర్ అమ్మకాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రతినెలా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) స్కూటర్ అమ్మకాలు వృద్ధిని కనబరుస్తున్నాయి. ముఖ్యంగా హోండా యాక్టివా బ్రాండ్ అమ్మకాలు ఎక్కువ వృద్ధిని సాధిస్తున్నాయి.
గడచిన జులై నెలలో హోండా మొత్తం 2.23 లక్షల స్కూటర్లను విక్రయిస్తే, ఆగస్ట్ నెలలో 2.18 లక్షల స్కూటర్లను విక్రయించింది. భారతదేశంలో అమ్ముడవుతున్న మొత్తం ద్విచక్ర వాహనాలలో స్కూటర్ల అమ్మకాలు నాలుగొంతులు ఉన్నాయి. ఇందులో అగ్రస్థానం హోండాదే. ఆ తర్వాతి స్థానాల్లో టీవీఎస్, హీరో మోటోకార్ప్, యమహా మొదలైన స్కూటర్ మేకర్లు ఉన్నారు.
హోండా స్కూటర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుండటంతో, వీటి వెయిటింగ్ పీరియడ్ కూడా అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, తమ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు గుజరాత్‌లో ఓ స్కూటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హోండాకు ప్రపంచంలో కెల్లా ఇదే అతిపెద్ద స్కూటర్ ప్లాంట్ కానుంది.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం స్కూటర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలలో దాదాపు 27 శాతానికి పైగా అమ్మకాలు స్కూటర్ల నుంచే వస్తున్నాయి. దాదాపు దశాబ్దం క్రితం దీని వాటా కేవలం 8 శాతంగా మాత్రమే ఉండేది. తమ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసినప్పటికీ, డిమాండ్‌ను చేరుకోవటం ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు హోండా పేర్కొంది.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి భారత మార్కెట్లో అత్యంత సక్సెస్ సాధించిన స్కూటర్ యాక్టివా. ఈ మోడల్ భారత్‌లో విడుదలై దాదాపు 13 ఏళ్లు గడిచాయి. ఇప్పటికీ ఈ మోడల్‌కు డిమాండ్ ఎక్కువే. హోండా యాక్టివా స్కూటర్‌ను కొనాలనుకునే ఇప్పటికీ నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం యాక్టివాలో 3 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








