మార్కెట్ నుంచి తొలగిపోనున్న హోండా సిబిఎఫ్ స్టన్నర్

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) దేశీయ విపణిలో అందిస్తున్న 125సీసీ మోటార్‌సైకిల్ 'హోండా సిబిఎఫ్ స్టన్నర్' (CBF Stunner) ఇకపై మార్కెట్ నుంచి పూర్తిగా తొలగిపోనుంది. ఈ మోడల్ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హోండా గడచిన సంవత్సరంలో ఈ మోడల్‌లో ఫ్యూయెల్ ఇంజక్షన్ వేరియంట్ ఉత్పత్తిని నిలిపి వేసింది. కాగా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్బురేటెడ్ వేరియంట్ ఉత్పత్తిని కూడా నిలిపివేయాలని హోండా భావిస్తోంది. ఒకప్పుడు హోండా సిబిఎఫ్ స్టన్నర్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది, అప్పట్లో ఈ మోడల్‌కు గట్టి పోటీనిచ్చే 125సీసీ బైక్ లేకపోవటమే దీని విజయానికి కారణమైంది.

Honda To Phase Out CBF Stunner From India

అయితే, ప్రస్తుతం 125సీసీ సెగ్మెంట్లో అనేక కొత్త మోడళ్లు అందుబాటులోకి రావటం, కస్టమర్లు ఎక్కువగా స్కూటర్ల వైపు మొగ్గు చూపుతుండటం వంటి పలు కారణాల వలన ఈ మోడల్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, హోండా సిబిఎఫ్ స్టన్నర్ మోడల్‌ను పూర్తిగా మార్కెట్ నుంచే తొలగించాలని హోండా భావిస్తున్నట్లు సమాచారం.

హోండా ఇప్పటికే తమ సిబి డాజ్లర్ మోడల్‌ను నిలిపివేసిన సంగతి తెలిసినదే. కొందరు డీలర్లు తెలిపిన సమాచారం ప్రకారం, గడచిన మూడు నెలలుగా తాము ఒక్క సిబిఎఫ్ స్టన్నర్‌ను కూడా అందుకోలేదట. హోండా స్టన్నర్‌లో ఉపయోగించిన 124.7సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పిల శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 14, 2014, 14:01 [IST]
English summary
Honda has stopped the regular production of its CBF Stunner due to poor demand. They are contemplating of completely phasing out the product in India. The Japanese manufacturer has not taken the motorcycle of its website and will clear its stock before they announce the end of its semi faired motorcycle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+