డ్రీమ్ సిరీస్ మోటార్‌సైకిళ్ల కోసం హోండా సరికొత్త టివిసి
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ), దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ బడ్జెట్ మోటార్‌సైకిళ్లు సిడి 110 డ్రీమ్, డ్రీమ్ నియో, డ్రీమ్ యుగల ప్రచారం కోసం కంపెనీ ఓ సరికొత్త టివిసిని విడుదల చేసింది.
హెచ్ఎమ్ఎస్ఐకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అక్షయ్ కుమార్‌పై చిత్రీకరించిన ఈ టెలివిజన్ కమర్షియల్‌లో హోండా తమ డ్రీమ్ సిరీస్ మోటార్‌సైకిళ్ల విశిష్టతలను హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. త్వరలోనే ఈ టివిసి పలు టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారం కానుంది.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/6EDQFsuiaCU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
హోండా డ్రీమ్ సిరీస్ మోటార్‌సైకిళ్లను వివిధ ఏజ్ గ్రూప్ వినియోగదారులను ఉద్దేశించి (20-40 ఏళ్ల మధ్యలో) తయారు చేశారు. ఇదే విషయాన్ని తమ ప్రకటన ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. ఇందులో అక్షయ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు ఉంటారు. ఈ ముగ్గురు మూడు రకాల వయస్సులకు చెందిన వారై ఉంటారు. ఈ ముగ్గురిలో ఒక్కొక్కరూ ఒక్కో రకం డ్రీమ్ సిరీస్ బైక్‌ను ఉపయోగిస్తుంటారు.
ఈ ముగ్గురు తాము ఉపయోగించే డ్రీమ్ సిరీస్ మోటార్‌సైకిళ్ల విశిష్టతను హైలైట్ చేస్తుంటారు. చివరిగా ఈ ముగ్గురి తండ్రి ఈ మూడు రకాల హోండా డ్రీమ్ సిరీస్ మోటార్‌సైకిళ్లు తమ కుమారుల మాదిరిగానే ఒకదానిని మించి మరొకటి ఉంటాయని చెప్తాడు. ఈ వీడియో గురించి నేను చెప్పడం కన్నా మీరే, మీ కళ్లతో స్వయంగా వీక్షించేయండి మరి..!


Click it and Unblock the Notifications








