250సీసీ సెగ్మెంట్లో 100 శాతం వృద్ధి: హ్యోసంగ్

By Ravi

భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియన్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హ్యోసంగ్, ఇక్కడి టూవీలర్ మార్కెట్లోని 250సీసీ బైక్ విభాగంలో 100 శాతం వృద్ధిని సాధించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది జులై-ఆగస్ట్ మధ్య కాలంలో మొత్తం 375 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

హ్యోసంగ్ 250సీసీ సెగ్మెంట్లో ఆక్విలా 250 క్రూజర్ మోటార్‌సైకిల్‌ను విక్రయిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఇది భారత మార్కెట్లో విడుదలైంది. ఇది విడుదలైన మొదటి నెలలో 275 బుకింగ్‌లను సొంతం చేసుకుంది.

అలాగే, 250సీసీ సెగ్మెంట్లో కంపెనీ ప్రవేశపెట్టిన రిఫ్రెష్డ్ జిటిఆర్250ఆర్ స్పోర్ట్స్ బైక్ కూడా కస్టమర్లను ఆకట్టుకోవటం సక్సెస్ సాధించింది. ప్రత్యేకించి ఇది యువకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది.

Hyosung Registers 100 Percent Growth In 250cc Segment

ఇదివరకటి త్రైమాసికంతో పోల్చుకుంటే, ఈ త్రైమాసికంలో అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని డిఎస్‌కే హ్యోసంగ్ చైర్మన్ శిరీష్ కులకర్ణి తెలిపారు. గడచిన సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే తాము 80-90 శాతం వృద్ధిని (సాలీనా) కనబరచామని ఆయన అన్నారు.

డిఎస్‌కే హ్యోసంగ్‌కు 250సీసీ సెగ్మెంట్ ఫాస్టెస్ట్ సెల్లింగ్ సెగ్మెంట్‌గా ఉందని, సానుకూల మార్కెట్ సెంటిమెంట్ కూడా అమ్మకాల పెరుగుదలకు తోడ్పిందని శిరీష్ తెలిపారు. ప్రతినెలా తాము 300 బైక్‌లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.

Most Read Articles

English summary
DSK Hyosung has announced a growth of over 100 percent year-on-year in their 250cc segment. The Korean auto maker has sold a total of 375 units during the period of July to August 2014.
Story first published: Thursday, September 18, 2014, 10:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X