బైకర్ల పండుగ 'ఇండియా బైక్ వీక్' తేదీలు వెల్లడయ్యాయ్

By Ravi

బైకర్ల పండుగ తేదీ ఖరారైంది. భారతదేశపు అతిపెద్ద బైకర్ ఫెస్టివల్ 'ఇండియా బైక్ వీక్' 2015 ఎడిషన్ తేదీలు ఖరారయ్యాయి. గడచిన రెండు ఎడిషన్లు విజయవంతం కావటంతో ఈసారి మరింత ఘనంగా మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు.

థర్డ్ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్‌ను కూడా సెకండ్ ఎడిషన్ మాదిరిగానే గోవాలోని వగతోర్ ప్రాంతం వద్ద ఫిబ్రవరి 20, 2015 మరియు ఫిబ్రవరి 21, 2015 తేదీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత్‌లోని సెవంటీ ఈవెంట్ మీడియా గ్రూప్, ఫాక్స్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.

ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్‌లో స్వదేశీయులే కాకుండా, ఇతర దేశాలకు చెందిన బైకర్లు కూడా పాల్గొననున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మోటార్‌సైకిల్ కార్యక్రమాల్లో ఒకటైన, అమెరికాలోని సౌత్ డకోటాలో నిర్వహించే వార్షిక 'స్టుర్గిస్ మోటార్‌సైకిల్ ర్యాలీ' నుంచి స్ఫూర్తి పొంది ఇండియా బైక్ వీక్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇండియా బైక్ వీక్‌ను తొలిసారిగా ఫిబ్రవరి 2013లో ప్రారంభించారు. ఆ తర్వాత రెండవ ఎడిషన్‌ను జనవరి 2014లో నిర్వహించారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఇండియా బైక్ వీక్

ఇండియా బైక్ వీక్ గురించి తెలుసుకునేందుకు తర్వాతి స్లైడ్‌లను పరిశీలించండి.

ఇండియా బైక్ వీక్

ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్‌ వేలాది మంది బైకర్లు తమ కెఫే రేసర్ల నుంచి స్క్రాంబర్ల వరకు అలాగే క్రూజర్ల నుంచి సూపర్‌బైక్‌ల వరకు బైక్‌లతో పండుగ చేసుకోనున్నారు.

ఇండియా బైక్ వీక్

మొదటి ఎడిషన్ ఇండియా బైక్ వీక్‌లో 6500 మందికి పైగా బైకర్లు అలాగే రెండవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్‌లో 7500 మందికి పైగా బైకర్లు సుమారు 4000 మోటార్‌సైకిళ్లతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడవ ఎడిషన్‌ను మరింత ఎక్కువ మంది హాజరు కాగలని అంచనా.

ఇండియా బైక్ వీక్

రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో కొత్త బైక్‌లు, ఉత్పత్తులు, యాక్ససరీలను కూడా విడుదల చేయటం జరుగుతుంది. బైక్ ప్రియుల కోసం ప్రత్యేక మార్కెట్ కూడా ఉంటుంది.

ఇండియా బైక్ వీక్

ఇండియా​ బైక్ వీక్ 2015 టికెట్ ధర ప్రతి వ్యక్తికి రూ.3,000, అక్టోబర్ 7, 2014వ తేది నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. ఆరోజున మొదటి 5 గంటల పాటు టికెట్ బుక్ చేసుకున్న వారికి ఎర్లీ బర్డ్ స్కీమ్ క్రింద రెండవ టికెట్‌పై 50 శాతం రాయితీ కూడా ఇవ్వనున్నారు.

ఇండియా బైక్ వీక్

ఇండియా బైక్ వీక్‌లో బైకర్లు చేసే స్టంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

More from DriveSpark

Article Published On: Friday, September 12, 2014, 17:56 [IST]
English summary
India’s largest festival planners the SEVENTY Event Media Group, together with the No.1 Travel and Lifestyle channel, FOX Life will hold the India Bike Week 2015 at Vagator in Goa on February 20 and 21 next year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+