యూకే నుంచి ఇండియాకు బైక్‌పై వస్తున్న సుశాంత్ శెట్టి
ఇండియన్ మోటార్‌సైక్లిస్టులకు మోటార్‌సైకిళ్లపై దూర ప్రయాణాలు చేయటమంటే చాలా ఇష్టం. చాలా మంది రైడర్లు ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్‌కి ట్రావెల్ చేస్తుంటారు. మరికొందరు బైకర్ గ్రూపులు నిర్వహించే ర్యాలీలు, పోటీలలో పాల్గొంటుంటారు. హిమాయలన్ టూర్ చేయాలనేది చాలా మందికి కలగా ఉంటుంది. ఏదేమైప్పటికీ, వీరంతా దాదాపుగా ఇండియా లోపలే లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు.
కానీ బైక్‌పై ఎవరైనా ఒక దేశం నుంచి ఇంకొక దేశం వెళ్లటానికి ప్రయత్నించారా..? ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి మాత్రం ఇలాంటి ఓ లాంగ్ రోడ్ ట్రిప్‌ను ప్లాన్ చేస్తున్నాడు. ఇతని పేరు సుశాంత్ శెట్టి, భారతదేశానికి చెందిన ఇతను యూకే నుంచి ఇండియాకి నేరుగా తన సుజుకి హయబుసా సూపర్‌బైక్‌పై రానున్నాడు.
సుశాంత్ జర్నీ అక్టోబర్ 25, 2014వ తేది నుంచి ప్రారంభం కానుంది. తనకు బైక్ రైడింగ్ అంటే ప్యాషన్ అని, యూరప్‌లో కొంత భాగం బైక్ రైడింగ్ చేశానని, ఏషియాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు యూకే నుంచి ఇండియాకు రోడ్ ట్రిప్ ప్లాన్ చేయాలనే ఆలోచన వచ్చిందని సుశాంత్ చెప్పుకొచ్చాడు.

ఈ లాంగ్ రోడ్ ట్రిప్ కోసం ముందుగా తాను కొన్ని విభిన్న బైక్‌ల గురించి ఆలోచించుకున్నాని, కానీ ఆ తర్వాత హయబుసాను ఎంచుకున్నానని చెప్పాడు. బల్గేరియా, స్లోవెనియా, టర్కీ, ఇరాన్, పాకిస్థాన్ దేశాల గుండా రోడ్డు మార్గం ద్వారా ఇండియాకి చేరుకోనున్నట్లు సుశాంత్ వివరించారు.
యూకే నుంచి ఇండియాకు రోడ్డు మార్గం ద్వారా రావటానికి 15 రోజుల సమయం పడుతుంది (నిరంతరాయంగా నడిపితే). అయితే, పాకిస్థాన్ గుండా ఇండియాకు రావటంలో అతనికి సరైన అనుమతి లభిస్తేనే ఈ జర్నీ పూర్తవుతుంది. మార్గమధ్యంలో ఎక్కడైనా అనుమతులు రావటం ఆలస్యం అయితే, ఇతని ప్రయాణం కూడా ఆలస్యమవుతుంది.
ఈ లాంగ్ రైడ్ తర్వాత సుశాంత్ ఇండియాకు చేరుకున్నాక తాను రైడ్ చేసుకుంటూ వచ్చిన సుజుకి హయబుసా బైక్‌ని 2015 ఇండియా బైక్ వీక్ 2015లో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ బైక్ రైడ్ పూర్తయిన తర్వాత సుశాంత్ తన బైక్‌ను తిరిగి యూకేకి ఎగుమతి చేయించుకోనున్నారు. మరి ఇతని లాంగ్ రోడ్ ట్రిప్ విజయవంతం కావాలని మనం కూడా కోరుకుందామా..!


Click it and Unblock the Notifications








