డ్యూక్ 390 ఓనర్ల కోసం బిఐసి వద్ద కెటిఎమ్ ట్రాక్ డే..
ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ తమ డ్యూక్ 390 బైక్ యజమానుల కోసం గతంలో చెన్నైలోని ఇరుంగట్టుకొట్టైలో ఉన్న మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ట్రాక్ వద్ద 'కెటిఎమ్ ఆరెంజ్ డే' పేరిట ఓ ట్రాక్ డే నిర్వహించిన సంగతి తెలిసినదే. అయితే, ఈసారి కెటిఎమ్ దీని కన్నా మరింత విస్తృత రీతిలో తమ ట్రాక్ డే ను ఘనంగా ప్లాన్ చేసింది.
గ్రేటర్ నోయిడాలో ఉన్న బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)పై ఈసారి కెటిఎమ్ తమ డ్యూక్ 390 యజమానుల కోసం ట్రాక్ డేను నిర్వహించనుంది. ఈ ట్రాక్ డే రోజున కెటిఎమ్ డ్యూక్ 390 యజమానులు తమ బైక్‌తో వచ్చి, బిఐసి రేస్ ట్రాక్‌పై తమ డ్యూక్ 390తో చక్కర్లు కొడుతూ, రియల్ టైమ్ రేసింగ్ అనుభూతిని పొందవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.

భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఫార్ములా వన్ (ఎఫ్1) రేసును నిర్వహించిన ట్రాక్‌పైనే ఈ కెటిఎమ్ 390 డ్యూక్ ట్రాక్ డేను కూడా నిర్వహించనున్నారు. సురక్షితమైన మరియు నియంత్రిత వాతావరణంలో టెస్ట్ రైడర్ నైపుణ్యాలను పెంపొందించుకునేలా ఈ ట్రాక్ డే కార్యక్రమం కొనసాగుతుంది. బిఐసి వద్ద ఈ ట్రాక్ మార్చ్ 15, 2014వ తేదీన కొనసాగుతుంది.
రిజిస్ట్రేషన్లు ఉదయం 7.00 గంటల నుంచి 8.30 గంటల వరకు సాగుతాయి. కెటిఎమ్ డ్యూక్ 390 బైక్ యజమానులు తమ చెల్లుబాటైన లైసెన్స్, ఇన్సూరెన్స్ (పర్సనల్ అండ్ వెహికల్) మరియు రైడింగ్ గేర్‌లను తెచ్చుకోవాల్సి ఉంటుంది. రైడింగ్ జాకెట్స్, బూట్స్, గ్లవ్స్, ఫుల్ ఫేస్ హెల్మెట్ వంటి సేఫ్టీ గేర్ కూడా తామే తెచ్చుకోవాల్సిన ఉంటుంది.


Click it and Unblock the Notifications








