బైక్‌ల ధరలు తగ్గించిన కెటిఎమ్ మరియు కవాసకి కంపెనీలు
గడచిన నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ద్విచక్ర వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఇప్పటికే పలు టూవీలర్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను కూడా తగ్గించిన సంగతి తెలిసినదే. తాజాగా.. ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ మరియు జపనీస్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కవాసకిలు కూడా తమ మోటార్‌సైకిళ్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
కెటిఎమ్ అందిస్తున్న డ్యూక్ 200, డ్యూక్ 390 మోడళ్ల ధరలను వరుసగా రూ.4,500 మరియు రూ.5,600 మేర తగ్గించారు. తాజా తగ్గింపు తర్వాత ఈ రెండు మోడళ్ల ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
* కెటిఎమ్ డ్యూక్ 200: రూ.1.30 లక్షలు
* కెటిఎమ్ డ్యూక్ 390: రూ.1.80 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి దేశీయ విపణిలో అందిస్తున్న నిన్జా 300, నిన్జా 650 మోడళ్ల ధరలను కూడా తగ్గించింది. తాజా తగ్గింపు తర్వాత ఈ రెండు మోడళ్ల ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
* కవాసకి నిన్జా 300: రూ.3.38 లక్షలు
* కవాసకి నిన్జా 650: రూ.4.92 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








