కెటిఎమ్ ఆర్‌సి 200, ఆర్‌సి 390 లైవ్ వెబ్‌కాస్ట్ లాంచ్
ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్, తమ ఆర్‌సి (RC) సిరీస్ బైక్‌లను సెప్టెంబర్ 9. 2014వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కెటిఎమ్ ఆర్‌సి 200 మరియు కెటిఎమ్ ఆర్‌సి 390 స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్లను విడుదలను కంపెనీ ప్రత్యక్షంగా యూట్యూబ్‌లో ప్రసారం చేయనుంది. ఈ ప్రసారాన్ని మీరు కూడా క్రింది వీడియోపై క్లిక్ చేసి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
ప్రస్తుతం కెటిఎమ్ భారత మార్కెట్లో డ్యూక్ సిరీస్ క్రింద డ్యూక్ 200, డ్యూక్ 390 నేక్డ్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. వీటికి ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్లే ఈ ఆర్‌సి 200, ఆర్‌సి 390 మోటార్‌సైకిళ్లు. ఈ రెండు కొత్త మోడళ్లను డ్యూక్ సిరీస్ ప్లాట్‌ఫామ్‌లను ఆధారంగా చేసుకొనే తయారు చేస్తున్నారు. డ్యూక్ మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్లనే ఆర్‌సి బైక్‌లలోను ఉపయోగిస్తున్నాయి. అయితే, ఇంజన్ పెర్ఫార్మెన్స్‌ను మాత్రం రీట్యూన్ చేసే అవకాశం ఉంది.

డ్యూక్ బైక్‌లతో పోల్చుకుంటే ఆర్‌సి బైక్‌లు మరింత స్పోర్టీగా అనిపిస్తాయి. ఈ ఆర్‌సి సిరీస్ బైక్‌లలో ఫైనల్ డ్రైవ్ రేషియో మరియు ఈసియూ లలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ మార్పుల వలన ఆర్‌సి 200, ఆర్‌సి 390 బైక్‌లలోని ఇంజన్లు మరింత ఎక్కువ పవర్‌ను డెలివరీ చేయగలవు. కెటిఎమ్ ఆర్‌సి 200, ఆర్‌సి 390 బైక్‌లకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








