రాజస్థాన్ మార్కెట్లో మహీంద్రా గస్టో స్కూటర్ విడుదల
మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్, ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన గస్టో ఆటోమేటిక్ స్కూటర్‌ను కంపెనీ తాజాగా రాజస్థాన్ మార్కెట్లో కూడా విడుదల చేసింది. రాజస్థాన్ మార్కెట్లో మహీంద్రా గస్టో స్కూటర్ ప్రారంభ ధర రూ.45,542 (ఎక్స్-షోరూమ్, జైపూర్)గా ఉంది. ప్రస్తుతానికి ఈ స్కూటర్ ప్రస్తుతానికి పశ్చిమ, ఉత్తర భారతదేశంలో మాత్రమే లభ్యం కానుంది.
కాగా.. వచ్చే జనవరి నాటికి భారతదేశంలో అన్ని ఇతర మార్కెట్లలోను గస్టో స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది. మహీంద్రా టూవీలర్స్ అభివృద్ధి చేసిన గస్టో స్కూటర్ ఓ గ్లోబల్ స్కూటర్. అంటే ఇది కేవలం ఇండియన్ మార్కెట్లోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా లభ్యం కానుంది. మరికొద్ది నెలల్లోనే ఈ స్కూటర్‌ను సౌత్ ఏషియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా గస్టో స్కూటర్‌ను అధునాతన ఇంజనీరింగ్ ఫీచర్లతో ఇటలీలో అభివృద్ధి చేశారు. మహీంద్రా గస్టో స్కూటర్‌లో అధునాతన ఎమ్-టెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ స్కూటర్‌లో ఉపయోగించిన 109.6సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.0 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్, వెనుక వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్‌ను ఉపయగించారు. దక్షిణ భారతదేశంలో ఇది జవరి నుంచి అందుబాటులో ఉంటుందని మహీంద్రా టూవీలర్స్ పేర్కొంది. ఇది మొత్తం ఆరు రంగులలో (ఐస్‌బర్గ్ వైట్, గలాక్టిక్ బ్లాక్, మాగ్నటిక్ మాగ్నెటా, వొల్కానో రెడ్, ఆర్కిటిక్ వైట్, రావెన్ బ్లాక్) లభిస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








