మహీంద్రా గస్టో స్కూటర్ తొలి టెలివిజన్ కమర్షియల్

By Ravi

మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ తాజాగా మార్కెట్లో విడుదల తమ 110సీసీ స్కూటర్ 'గస్టో' (Gusto) కోసం కంపెనీ ఓ కొత్త టెలివిజన్ కమర్షియల్‌ను విడుదల చేసింది. మహీంద్రా గస్టో స్కూటర్ శక్తి సామర్థ్యాలను చూపించేలా ఈ టెలివిజన్ కమర్షియల్ సాగిపోతుంది.

ఈ వీడియోలో.. ఓ జంట విహారానికి వస్తుంది. వీరిద్దరూ సముద్రంపై సర్ఫింగ్ చేయాలనుకుంటారు, కానీ అలలు లేకపోవటంతో ఒకరు ఒడ్డుపై స్కూటర్ నడుపుతుంటే మరొకరు సముద్రంపై సర్ఫింగే చేస్తుంటారు. ఇదంతా చూడటానికి డ్రమాటిక్‌గా ఉన్నప్పటికీ, ఇందులోని గ్లామర్ మాత్రం వీక్షకులను ఆకట్టుకుంటుంది. మరి ఆలస్యమెందుకు, ఆ హాట్ వీడియోని మీరు కూడా చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/U8AvGGB5oDs?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
మహీంద్రా గస్టో విషయానికి వస్తే.. దేశీయ విపణిలో ఇది రెండు వేరియంట్లలో (డిఎక్స్, విఎక్స్) లభిస్తుంది. గస్టో డిఎక్స్ వేరియంట్ ధర రూ.43,000లుగా ఉంటే, మహీంద్రా గస్టో విఎక్స్ వేరియంట్ ధర రూ.47,000 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.. ఇవి ప్రారంభోత్సవ ధరలు మాత్రమేనని, దీపావళి వరకు మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

మహీంద్రా గస్టో స్కూటర్‌లో అధునాతన ఎమ్-టెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులోని 109.6సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.0 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది మొత్తం ఆరు రంగులలో (ఐస్‌బర్గ్ వైట్, గలాక్టిక్ బ్లాక్, మాగ్నటిక్ మాగ్నెటా, వొల్కానో రెడ్, ఆర్కిటిక్ వైట్, రావెన్ బ్లాక్) లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 30, 2014, 12:43 [IST]
English summary
Introducing the all New Mahindra Gusto. With Features you'll find in no other scooter in India! Mahindra Gusto will be available in two trim and priced at INR 43,000 for Dx and INR 47,000 for Vx variants.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+