వెస్పా కేర్ రోడ్ సైడ్ అసిస్టెన్స్‌ను ప్రారంభించిన పియాజ్జియో
ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం పియాజ్జియో, భారత మార్కెట్లో విక్రయిస్తున్న వెస్పా స్కూటర్లను వినియోగించే కస్టమర్ల కోసం ఓ సరికొత్త ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ప్రణాళికను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.
వెస్పా కేర్ (Vespa Care) పేరుతో ప్రారంభించిన ఈ ప్రణాళికలో భాగంగా, దేశంలోని 51 నగరాల్లో ఉన్న వెస్పా వినియోగదారులకు కంపెనీ 365 రోజులు, 24x7 రోడ్ సైడ్ అసిస్టెన్స్‌ను అందించనున్నట్లు పేర్కొంది. వెస్పా వినియోగదారులకు అత్యవసర సమయాల్లో అవసరమైన మద్ధతును అందించేందుకు ఈ వెస్పా కేర్ ప్రణాళికను డిజైన్ చేశామని పియాజ్జియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వివరించింది.

స్పీడ్ అసిస్టెన్స్ కోసం ఫుల్లీ కస్టమైజ్డ్ అసిస్టెన్స్ సాఫ్ట్‌వేర్‌తో పాటుగా ఈ ప్రణాళిక కోసం ప్రత్యేకంగా శిక్షణ అందించిన నిపుణులను ఉపయోగించనున్నట్లు పియాజ్జియో పేర్కొంది. స్కూటర్‌లో ఇంధనం ఖాలీ అయిపోనా, తాళం చెవులను రీప్లేస్ చేయాల్సి వచ్చినా, టైరు పంక్చర్ అయినప్పుడు ఆన్‌సైట్ అసిస్టెన్స్ అవసరమైనా లేదా అత్యవసర పరిస్థితులలో వైద్య సాయం అవసరమైనా వెస్పా కేర్ ద్వారా పొందవచ్చు.
ఒకవేళ వెస్పా స్కూటర్ ఓనర్‌షిప్ మారినా (స్కూటర్‌ను వేరొకరికి విక్రయించినా) సరే, కొత్త ఓనర్‌కి కూడా ఈ కవరేజ్ అసిస్టెన్స్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. వెస్పా ఒక ప్రీమియం ఐకానిక్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అని, ఇలాంటి ప్రీమియం బ్రాండ్ విషయంలో ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సదుపాయాలు ఎంతో కీలమైనందున ఈ వెస్పా కేర్ రోడ్ అసిస్టెన్స్‌ను భారత్‌లో పరిచయం చేశామని పియాజ్జియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇండియా) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రవి చోప్రా తెలిపారు.


Click it and Unblock the Notifications








