వీడియో: స్టంట్ చేస్తూ కెమెరాకి చిక్కిన పల్సర్ 200ఎస్ఎస్

By Ravi

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో విక్రయిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ (నేక్డ్ స్పోర్ట్స్) బైక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ కొత్త మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోంది, ఈ బైక్‌కు పల్సర్ 200ఎస్ఎస్ (సూపర్ స్పోర్ట్) అనే పేరును పెట్టవచ్చని డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించడం, మరియు ఈ బైక్‌కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ స్పై చిత్రాలను కూడా విడుదల చేయటం తెలిసినదే.

కాగా.. ఈ బైక్‌కు సంబంధించి తాజా స్పై వీడియో ఒకటి యూట్యూబ్‌లో లీక్ అయ్యింది. క్యామోఫ్లేడ్జ్ లేకుండా స్టంట్ చేస్తున్న పల్సర్ 200ఎస్ఎస్‌ను ఓ బైక్ ప్రియుడు తన మొబైల్‌లో చిత్రీకరించాడు. బజాజ్ ఈ బైక్‌ను పూనే రోడ్లపై టెస్ట్ చేస్తోంది. ఈ బైక్‌ను మహారాష్ట్రలోని చాకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. బజాజ్ పల్సర్ 200ఎస్ఎస్ బైక్ డిజైన్ చూడటానికి కంపెనీ గడచిన ఆటో ఎక్స్‌పో 2014లో ఆవిష్కరించిన పల్సర్ 400ఎస్ఎస్ మాదిరిగానే అనిపిస్తుంది.

Pulsar 400 SS

బజాజ్ పల్సర్ 200ఎస్ఎస్ మోడల్ ఉత్పత్తి దశకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. టెస్టింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఇది మార్కెట్లకు చేరుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 200ఎన్ఎస్ బైక్‌లో ఉపయోగిస్తున్న సరికొత్త 200సీసీ ఇంజన్‌నే ఈ కొత్త పల్సర్ 200ఎస్ఎస్ బైక్‌లో ఉపయోగించవచ్చని సమాచారం.

ఈ ఇంజన్‌లో కంపెనీ పేటెంటెడ్ ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 23.52 పిఎస్‌ల శక్తిని, 18.3 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. సరే ఈ లోపుగా కెమెరాకు చిక్కిన పల్సర్ 200ఎస్ఎస్ స్టంట్ వీడియోని చూద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/QNbkjOhxnDM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
We have found a video of Bajaj's Pulsar 200 SS performing stunts at a recent event. The rider is performing burnouts and also doing donuts at the same time. The exhaust note of the motorcycle is clearly audible and we like what we hear.&#13;
Story first published: Friday, October 31, 2014, 14:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X