ఆగస్ట్ నెలలో 66 శాతం వృద్ధి రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు

By Ravi

ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్, గడచిన ఆగస్ట్ నెలలో భారీ వృద్ధిని కనబరిచింది. ఐషర్ మోటార్స్‌కి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న అన్ని మోటార్‌సైకిళ్ల అమ్మకాల జోరుగా సాగుతున్నాయి. ఆగస్ట్ 2013తో పోల్చుకుంటే ఆగస్ట్ 2014లో కంపెనీ అమ్మకాలు ఏకంగా 66 శాతం వృద్ధిని కనబరచాయి.

గడచిన నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తంగా 26,643 మోటార్‌సైకిళ్లను విక్రయించగా (ఎగుమతులతో కలిపి), అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో మొత్తంగా 15,708 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఆగస్ట్ 2014లో దేశీయ విపణిలో 26,121 మోటార్‌సైకిళ్లను విక్రయించగా, 522 మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేసింది.

Royal Enfield August 2014 Sales Report

చెన్నై సమీపంలో ఓరగడం వద్ద ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం వలనే అమ్మకాలు పెరుగినట్లు తెలుస్తోంది. ఈ ప్లాంటులో సగటున ప్రతినెలా 10,000 రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు ఉండే భారీ డిమాండ్ కారణంగా, వాటి వెయింట్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ, 500సీసీ రేంజ్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. భవిష్యత్తులో మరింత ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 3, 2014, 10:16 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+