అక్టోబర్‌లో 47 శాతం పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు

By Ravi

ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్, గడచిన అక్టోబర్ నెల అమ్మకాలలో ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచింది. ఐషర్ మోటార్స్‌కి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న అన్ని మోటార్‌సైకిళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అక్టోబర్ 2013తో పోల్చుకుంటే అక్టోబర్ 2014లో కంపెనీ మొత్తం అమ్మకాలు (ఎగుమతులతో కలిపి) 47 శాతం వృద్ధిని కనబరచాయి.

గడచిన నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తంగా 26,039 మోటార్‌సైకిళ్లను విక్రయించగా అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో మొత్తంగా 17,659 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. అక్టోబర్ 2014లో దేశీయ విపణిలో 25,520 మోటార్‌సైకిళ్లను విక్రయించగా, 529 మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేసింది.

Royal Enfield Sales

చెన్నై సమీపంలో ఓరగడం వద్ద ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం వలనే అమ్మకాలు పెరుగినట్లు తెలుస్తోంది. ఈ ప్లాంటులో సగటున ప్రతినెలా 10,000 రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు ఉండే భారీ డిమాండ్ కారణంగా, వాటి వెయింట్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ, 500సీసీ రేంజ్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. భవిష్యత్తులో మరింత ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

Most Read Articles

English summary
Two-wheeler maker Royal Enfield today reported 47.45 per cent increase in its total sales in October at 26,039 units as against 17,659 units in the same month last year.
Story first published: Saturday, November 1, 2014, 16:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X